Rajinikanth: సూపర్ స్టార్ రజిని ఇంట్లోకి భారీగా చేరిన వరద నీరు.. వీడియో వైరల్!

మిచౌంగ్ తుఫానుతో చెన్నైతో పాటు ఏపీలోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేసిన సంగతి మనకు తెలిసిందే. తీవ్రమైనటువంటి ఈ తుఫాను కారణంగా పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. దీంతో చెన్నై మహానగరం నీట మునిగిపోయింది అలాగే ఏపీలో కూడా పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున వరదలు వ్యాప్తి చెందాయి. ముఖ్యంగా చెన్నై మొత్తం వరదలు ఎక్కువగా రావడంతో కరెంటు లేక తిండి లేక ఎక్కడికి అక్కడ ప్రజాజీవనం స్తంభించిపోయింది.

ఇలా వరద ప్రభావం తగ్గడంతో అధికారులు సహాయ చర్యలు భద్రత చర్యలను చేపట్టారు. ఇక లోతట్ట ప్రాంతాలన్నీ పూర్తిగా నీట మునిగిపోవడంతో సాధారణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ వరద కారణంగా సాధారణ ప్రజల జీవన విధానం స్తంభించిపోవడమే కాకుండా స్టార్స్ కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని చెప్పాలి. ఇక ఈ వరద ప్రభావం సూపర్ స్టార్ రజనీకాంత్ నివాసం పై కూడా భారీగానే పడిందని తెలుస్తుంది.

రజనీకాంత్ (Rajinikanth) ఇంటి ముందు పెద్ద ఎత్తున వరద నీరు చేరుకున్నాయి. అలాగే ఈయన ఇంటి లోపల కూడా సుమారు ఒక అడుగు ఎత్తువరకు నీరు చేరుకున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక వీడియోని నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

ఈ భయంకరమైనటువంటి తుఫాను కారణంగా తమిళనాడు ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేస్తున్నారు. అలాగే మరికొందరు వరద బాధితులను ఆదుకోవడానికి స్వయంగా ముందుకు వచ్చారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus