“రజని”ఈజ్ “సేఫ్”

తమిళ సూపర్ స్టార్ రజని కాంత్ అంటే ఇష్టపడని వారు ఉండరేమో. ఆయన సినిమా అంటేనే పండుగ. అలాంటిది ఆయన హాస్పిటల్ లో చేరారు అనే వార్త వింటే ఇంకేమైనా ఉందా…అసలు ఇంతకీ విషయం ఏంటంటే నిన్న ఉదయం రజని హుటాహుటిన హాస్పిటల్ లో చేరాడని, రజని కి మళ్లీ ఏమైంది? అని మీడియాలో వార్త రావడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఇక కొద్ది సేపటి తరువాత రజని డిసార్జ్ అని తెలియగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ తలైవార్ కు ఏమయ్యింది..అసలు ఆయన ఆసుపత్రికి ఎందుకు వెళ్లారు? అనే ప్రశ్నలు అభిమాన సాంద్రాన్ని వేదిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే…..తలైవార్ సూపర్ గా ఉన్నారు. ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు…దాదాపుగా మూడు నెలల నుండి రజనీ ‘కబాలి’ సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. అసలు గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ చేయడం వలన ఆయనపై విపరీతమైన ప్రెజర్ పడి కొంచెం ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఫుల్ బాడీ చెకప్ చేయించుకుందాం అని నిన్న హాస్పిటల్ కు వెళ్లారట. అంతేకాకుండా మరో వారంలో రజనీ తన కొత్త సినిమా రోబో 2.0 తాలూకు యాక్షన్ సన్నివేశాలకు షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. అందుకే ఈలోపే ఒకసారి డాక్టర్ ను కన్సల్ట్ చెయ్యడం బెట్టర్ అని అలా చెక్ అప్ కు వెళ్లారంట. డాక్టర్స్ కూడా కాస్త రెస్ట్ తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. అది మ్యాటర్.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus