సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ కి తమిళనాడులో కోట్ల సంఖ్యలో వీరాభిమానులు ఉన్నారు. రాజకీయాల్లోకి అయన అడుగుపెడితే వారి ఓట్లన్నీ ఆయనకే. ఫ్యాన్స్ ఎన్నోసార్లు ఎన్నికల్లో నిలబడమని ఒత్తిడి తెచ్చారు. 2014 ఎన్నికల్లో అయితే నరేంద్రమోడీ, బీజేపీలోకి రజినీకాంత్ ని ఆహ్వానించారు. ఆయనకు ధైర్యం చాలక అడుగుముందుకు వేయలేక పోయారు. సూపర్ స్టార్ కి అధికారమంటే ఇష్టమే. కానీ ఎన్నికల్లో ఓడిపోతే అవమానమని అటువైపు రాలేదు. ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్న రాజకీయ మార్పులు పరిశీలిస్తున్న రజినీకి తాను రాజకీయాల్లోకి రావడం ఇది సరైన సమయమని భావిస్తున్నారు. అందుకే తాజాగా తనకి అధికారమంటే ఇష్టమని మనసులోని మాటను బయటపెట్టారు.
దీంతో అభిమానుల్లో ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. రజనీకాంత్ కొత్త పార్టీ పెట్టేస్తున్నారని సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో నిలబడితే తాను ముఖ్యమంత్రి అయ్యే ఆస్కారం ఎంత మేర ఉందే రజనీకాంత్ శాస్త్రీయ పద్దతిలో సర్వే నిర్వహిస్తున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ పేరు, జెండా, అజెండా లపై కూడా నిపుణుల మిత్ర బృందం గట్టిగానే కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించాయి. ఈ పార్టీ బీజీపీకి మద్దతుగా ఉంటుందనేది ఖరారు అయిపోయిందంట. మరి ఈ సమాచారంలో ఎంతవరకు నిజానిజాలున్నాయో మరికొన్ని రోజుల్లో తెలియనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.