ఆసియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకొన్న రజనీకాంత్

రెండేళ్ల క్రితం రజనీకాంత్ రెమ్యూనరేషన్ 50 కోట్లు అని తెలిసినప్పుడు ముక్కున వేలేసుకొన్నారందరూ. అయితే.. తెలుగు, తమిళం, హిందీతోపాటు చైనాలోనూ విశేషమైన మార్కెట్ కలిగిన హీరో కాబట్టి ఆయనకు ఆమాత్రం ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు అని ఫిక్సయ్యారు. ఆ తర్వాత కేవలం తెలుగులో మాత్రమే మార్కెట్ ఉన్న ఎన్టీయార్ కు 20 కోట్లు, పవన్ కళ్యాణ్ కు 25 కోట్లు, మహేష్ బాబుకు 27 కోట్ల రెమ్యూనరేషన్ అంటే షాక్ అయిపోయారు. అలాంటిది ఇప్పుడు “బాహుబలి” వీరుడు ప్రభాస్ కు ఏకంగా 30 కోట్ల రెమ్యూనరేషన్ అని తెలిసేసరికి మిగతా హీరోల అభిమానుల సంగతి ఎలా ఉందో తెలియదు కానీ.. ప్రభాస్ అభిమానులు మాత్రం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయారు.

అయితే.. ఇప్పుడు ఆ రికార్డులన్నీ రజనీకాంత్ మళ్ళీ తానే తిరగరాశాడు. “దర్బార్” సినిమా కోసం ఏకంగా 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకొన్నాడు రజనీ. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను ఇటీవల కమల్ పుట్టినరోజు కానుకగా మహేష్ బాబు, మోహన్ లాల్, కమల్ హాసన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. రెమ్యూనరేషన్ విషయంలో రజనీకాంత్ రికార్డ్ ను బ్రేక్ చేయాలంటే మన టాలీవుడ్ హీరోలకు మాత్రమే కాదు బాలీవుడ్ హీరోల వల్ల కూడా ఇప్పుడప్పుడే అయ్యేపని కాదు.

17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus