యువ హీరోల కంటే వేగంగా ఉన్న సూపర్ స్టార్!

అరవైఏడేళ్ల రజినీకాంత్.. లైట్స్ యాక్షన్ అనగానే పాతికేళ్ల కుర్రోడిగా మారిపోతారు. తన స్టైల్ తో మెస్మరైజ్ చేస్తారు. కుర్ర హీరోలకు పోటీ ఇస్తారు. తెరమీదేకాదు.. పనిచేయడంలోనూ యువహీరోలకు ఛాలెంజ్ విసిరారు. అదెలా అంటే… కాలా సినిమా తర్వాత పిజ్జా, జిగర్‌తండ, ఇరైవి చిత్రాలతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజినీకాంత్ తో “పెట్ట” అనే సినిమా చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సిమ్రాన్ నటిస్తోంది. ఈ సినిమా తొలి షెడ్యూల్ డార్జిలింగ్ లో పూర్తి చేసుకుంది. విదేశాల్లో పురాతన కట్టడాల మధ్యన షూటింగ్ జరుపుకుంది.

అయితే సడన్ గా ఈ సినిమా పూర్తి అయిందంటూ రజినీ కాంత్ షాక్ ఇచ్చారు. “పెట్ట” చిత్రీకరణ మొదలై కనీసం నాలుగు నెలలు కూడా కాలేదు, అప్పుడే చిత్రీకరణ పూర్తి అవ్వడం ఏంటంటూ సినీ వర్గాల వారు కూడా షాక్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు ఒక సినిమాకి ఆరు నెలల సమయం తీసుకుంటున్నారు.  పెద్ద సినిమాలైతే రెండేళ్లు కూడా పడుతోంది. ఇలాంటి సమయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాను కేవలం నాలుగు నెలల్లో పూర్తి చేసి యువహీరోలు సవాలు విసిరారు. పక్కా ప్లానింగ్ తో అన్ని విధాలుగా ముందు జాగ్రత్తలు తీసుకుని చేయడంతో అనుకున్న సమయం కంటే 15 రోజుల ముందే చిత్రీకరణ పూర్తి చేసుకుందని రజినీకాంత్ వెల్లడించారు. ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉంటుందని కోలీవుడ్ వర్గాలు తెలిపాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus