THALAIVAR 173: పవర్ఫుల్ టీమ్ తో తలైవా.. ఎవరెవరు ఉన్నారంటే?

సూపర్ స్టార్ రజినీకాంత్.. వయసు పెరుగుతున్నా కొద్దీ ఆయన స్పీడ్ ఇంకా పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. నెల్సన్‌తో ‘జైలర్ 2’ లైన్‌లో ఉండగానే.. అప్పుడే తన 173వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే ఈసారి రజినీ ఎంచుకున్న టీమ్, టెక్నీషియన్స్ లిస్ట్ చూస్తుంటే.. కేవలం స్టార్ డమ్ మాత్రమే కాదు, కంటెంట్ పరంగా కూడా గట్టిగా కొట్టబోతున్నారని అర్థమవుతోంది.

THALAIVAR 173

అందరి అంచనాలకు భిన్నంగా రజినీ ఈ ప్రాజెక్ట్ బాధ్యతలను యువ దర్శకుడు రామ్ కుమార్ బాలకృష్ణన్ చేతిలో పెట్టారు. ‘పార్కింగ్’ అనే చిన్న సినిమాతో పెద్ద విజయాన్ని అందుకున్న రామ్ కుమార్ టేకింగ్ రజినీకి బాగా నచ్చిందట. కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకుడిని నమ్మి, తన సినిమాను అప్పగించడం రజినీ గట్స్ కు నిదర్శనం. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చాపకింద నీరులా మొదలైపోయాయి.

ఇక ఈ ప్రాజెక్టులో అసలైన హైలైట్ క్యాస్టింగ్. సహజ నటనకు పెట్టింది పేరైన సాయి పల్లవి ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించబోతోందట. ‘అమరన్’ సక్సెస్ తర్వాత ఆమె క్రేజ్ పీక్స్‌లో ఉంది. ఇప్పుడు తలైవాతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే ఆ మ్యాజిక్ వేరే లెవెల్‌లో ఉంటుంది. అలాగే విలక్షణ నటుడు కదిర్ కూడా ఇందులో భాగం కాబోతున్నారు. అంటే రజినీ చుట్టూ బలమైన పెర్ఫార్మర్లు ఉండబోతున్నారన్నమాట.

రజినీ స్వాగ్‌ను ఎలివేట్ చేయాలంటే అనిరుధ్ మ్యూజిక్ ఉండాల్సిందే. అందుకే ఈ సినిమాకు కూడా ఆస్థాన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌నే ఫిక్స్ చేశారు. ‘పేట’, ‘జైలర్’ సినిమాల్లో అనిరుధ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రజినీని ఏ రేంజ్‌లో చూపించిందో మనకు తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ డెడ్లీ కాంబో రిపీట్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. గతంలో ఈ కథను హీరో శింబు కోసం రాసుకున్నారని, దాన్నే రజినీతో తీస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదని, తలైవా ఇమేజ్ కోసం రామ్ కుమార్ పూర్తిగా కొత్త కథను సిద్ధం చేశారని తెలుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus