కొత్త సినిమాలో రజినీకాంత్ పాత్ర ఇదే!

పిజ్జా, జిగర్‌తండ, ఇరైవి చిత్రాలతో ప్రతిభను చాటుకున్న కార్తీక్ సుబ్బరాజు దక్షిణాది సూపర్ స్టార్ రజినీ  కాంత్ ని డైరక్ట్ చేసే అవకాశం అందుకున్నారు. కాలా సినిమా తర్వాత రజినీకాంత్ అతని దర్శకత్వంలోనే సినిమా చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సిమ్రాన్ నటిస్తోంది. చాలా కాలం తర్వాత సిమ్రాన్ ని హీరోయిన్ గా చూడబోతున్నాం. ఈ సినిమా తొలి షెడ్యూల్ డార్జిలింగ్ లో జరుగుతోంది.  40 రోజులపాటు నాన్ స్టాప్ గా ఈ షూటింగ్ కొనసాగనుంది. ఈ చిత్రం గురించి ఆసక్తికర న్యూస్ బయటికి వచ్చింది. ఇందులో రజినీ కాంత్ పోషించే పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయంట.

ఒక కాలేజీ విద్యార్థుల హాస్టల్ కి వార్డెన్ గా పనిచేసే రజినీ..  డాన్ గా కూడా కనిపించబోతున్నట్లు తెలిసింది. బాషా సినిమాలో ఆటోడ్రైవర్ గా కనిపించి.. ప్లాష్ బ్యాక్ లో డాన్ గా రజినీ కాంత్ నటన అమోఘం. ఆ సినిమా లైన్ తో అనేక సినిమాలు వచ్చాయి. సూపర్ హిట్ కొట్టాయి. రజినీ కాంత్ మాత్రం అటువంటి కథని ఓకే చేయలేదు. మళ్ళీ ఇన్నాళ్లకి అలాంటి పాత్రను పోషిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్న ఈ చిత్రం తర్వాతి షెడ్యూల్ డెహ్రా డూన్ లో సాగనుంది. చెన్నైలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus