హీరోగా స్టార్ ప్లేయర్ భర్త.. రజినీ కాంత్ స్పెషల్ రోల్..

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ వయసు పెరిగే కొద్దీ రెట్టింపు ఉత్సాహంతో, యంగ్ హీరోలతో క్రేజీ ప్రాజెక్టులు లైన్లో పెడుతున్నారు.. గతేడాది ‘అన్నాత్తే’ (పెద్దన్న) గా వచ్చారు. ప్రస్తుతం ‘బీస్ట్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్‌తో పాన్ ఇండియా ఫిలిం ‘జైలర్’ చేస్తున్నారు. ఇటీవలే కోలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్స్‌తో రెండు సినిమాలు సైన్ చేశారు. వాటిలో ఒక చిత్రానికి తన పెద్ద కుమార్తె ఐశ్యర్య రజినీ కాంత్ దర్శకురాలు..

ఇటీవల రజనీ ఇందులో నటిస్తారని తెలియగానే… ఐశ్వర్య ‘కొచ్చడయాన్’ రిజల్ట్ గుర్తు చేసుకుని కంగారు పడ్డారు ఫ్యాన్స్.. అయితే తలైవా తన కూతురు రూపొందించబోయే చిత్రంలో కేవలం స్పెషల్ అప్పీరియన్స్ ఇస్తున్నారని.. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారని కన్ఫామ్ చేశారు. నవంబర్ 5న సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో సినిమాను ఘనంగా ప్రారంభించారు. రజని నటిస్తున్న 170వ చిత్రమిది.. ‘లాల్ సలాం’ అనే టైటిల్ పెట్టారు. క్రికెట్ నేపథ్యంతో తెరకెక్కనుందని తెలుస్తోంది.

రజినీతో సహా టీం అంతా ఈ వేడుకలో పాల్గొన్నారు. లెజెండరీ మ్యుజీషియన్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతమందించనున్నారు.. విష్ణు విశాల్ తమిళ నాట టాలెంటెడ్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలతో విష్ణు వివాహం జరిగిన సంగతి తెలిసిందే. మాస్ మహారాజా రవితేజ నిర్మిస్తున్న ‘మట్టి కుస్తీ’ లోనూ ఇతను హీరోగా నటిస్తున్నాడు.. ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇద్దరు యంగ్ హీరోలు నటిస్తున్న ‘లాల్ సలాం’ లో రజినీ ఏ రోల్ చేయబోతున్నారబ్బా?.. అంటూ అప్పుడే డిస్కషన్స్ స్టార్ట్ చేసేశారు ఫ్యాన్స్, నెటిజన్లు.. క్రికెట్ బ్యాక్ డ్రాప్ అంటున్నారు కాబట్టి సూపర్ స్టార్ కోచ్ క్యారెక్టర్‌లో కనిపిస్తారేమోనంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఐశ్యర్య రజినీ కాంత్ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించబోతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది.. కోలీవుడ్ టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు..

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus