Rajinikanth: యంగ్ హీరో సినిమాలో సూపర్ స్టార్!

  • October 22, 2022 / 03:04 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ కి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. తన కెరీర్ లో ఎన్నో హిట్టు సినిమాలు చేశారాయన. గెస్ట్ రోల్స్ చేయడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అప్పుడెప్పుడో 2011లో వచ్చిన షారుఖ్ ఖాన్ ‘రా వన్’ సినిమాలో చిట్టి రోబోగా అతిథి పాత్రలో కనిపించారు. ఆ తరువాత మరే సినిమాలో గెస్ట్ రోల్ చేయలేదు. ఇప్పుడు ఓ సినిమాలో అతిథి పాత్రలో కనిపించడానికి రెడీ అవుతున్నారు.

రజినీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు ఆమె తీసిన సినిమాలేవీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడు అధర్వ మురళీ హీరోగా ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారామె. ఇందులో తన తండ్రిని గెస్ట్ రోల్ లో నటింపజేసేలా స్క్రిప్ట్ రెడీ చేశారు. ఈ విషయాన్ని రజినీకాంత్ కి చెప్పగా.. ఆయన కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుంది.

ఇదివరకు లైకా ప్రొడక్షన్స్ లో కొన్ని సినిమాలు చేశారు రజినీకాంత్. కూతురు సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి ఆ సంస్థతో ఉన్న అనుబంధం కూడా ఒక కారణమని అంటున్నారు. ఇక రజినీకాంత్ సినిమాల విషయానికొస్తే.. ఈ మధ్యకాలంలో ఆయన నుంచి ఒక్క హిట్ సినిమా కూడా రాలేదు. ఆయన సినిమాలు ప్లాప్ అయినా.. కలెక్షన్స్ మాత్రం ఓ రేంజ్ లో వస్తాయి. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కానీ రజినీకాంత్ ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరో నుంచి ఒక హిట్టు సినిమా రావాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం రజినీకాంత్.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ అనే సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అలానే రీసెంట్ గా ‘బింబిసార’ డైరెక్టర్.. రజినీకాంత్ కి కథ చెప్పినట్లు సమాచారం.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus