త్వరలోనే మళ్ళీ పెళ్లి చేసుకోనున్న రజనీకాంత్ రెండో కుమార్తె

Advertisement

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఐశ్వర్య ధనుష్, సౌందర్య రజినీకాంత్ ఇద్దరు కూతుర్లు. తన మొదటి కుమార్తెకి హీరో ధనుష్ భర్త అనే విషయం మన అందరికి తెలిసిందే. ఇక రజినీకాంత్ గారి రెండో కుమార్తె సౌందర్య రజినీకాంత్ విషయానికి వస్తే, ఈమె తమిళ ‘కొచ్చాడియాన్’ తెలుగులో అనువాదమైన ‘విక్రమసింహ’ మరియు ‘వి.ఐ.పి.2’ సినిమాలకు దర్శకత్వం వహించింది. అయితే 2017 వ సంవత్సరంలో విడాకులు తీసుకున్న ఈమె వచ్చే సంవత్సరం రెండో పెళ్లి చేసుకుంటుందని సమాచారం.

ఇక విషయంలోకి వెళితే, అశ్విన్ అనే ఒక వ్యాపారవేత్తని పెళ్లి చేసుకున్న సౌందర్య రజినీకాంత్ పెళ్ళైన ఏడు సంవత్సరాలకి కొన్ని కారణాల వలన అతడి నుండి 2017 లో విడాకులు తీసుకుంది. వీరిద్దరికి వేద్ అనే ఒక బాబు కూడా ఉన్నాడు. వీరిద్దరూ విడిపోయినప్పటికీ ప్రస్తుతం ఈ బాబు తల్లివద్దే పెరుగుతున్నాడు. అయితే తమిళ్ లో కొన్ని సినిమాల్లో నటించిన వ్యాపారవేత్త విశాకన్ తో ఈమెకు ఇటీవలే నిచితార్థం అయినట్లుగా చెన్నై సమాచారం. అతడికి, ఆమెకి ఇద్దరికీ కూడా ఇది రెండో వివాహం కావడం వలన పెళ్లిని సింపుల్ గా చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus