రజినీకాంత్ వయసు ఇప్పుడు 72 ఏళ్ళు.ఈ వయసులో ఆయన హీరోగా సినిమాలు చేయడం అంటేనే చాలా గొప్ప విషయం. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఫీట్ మరో హీరోకి సాధ్యపడకపోవచ్చు. అయినా కాలంతో సంబంధం లేని స్టార్ డం ఆయనది..! ఇప్పటికీ ఆయన సినిమా రిలీజ్ అయ్యింది అంటే టికెట్ల కోసం క్యూలు కట్టే జనాలు కోట్ల మీద ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. అందుకే నిర్మాతలు ఇప్పటికీ రజినీకాంత్ తో భారీ బడ్జెట్ చిత్రాలు చేయడానికి రెడీ అవుతున్నారు.
రజినీకాంత్ నటించిన గత నాలుగైదు సినిమాలు సరిగ్గా ఆడలేదు. అయినా అవి నిర్మాతలకి నష్టాలూ తెచ్చిపెట్టలేదు. తమిళంలో ఆ సినిమాలు చాలా వరకు కమర్షియల్ గా సేఫ్ అయ్యాయి. సరే ఇక అసలు విషయానికి వచ్చేస్తే.. రజినీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా ఆగస్టు 10 న విడుదల కాబోతోంది. ‘డాక్టర్’ ‘బీస్ట్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇక ‘సన్ పిక్చర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని ఏకంగా రూ.225 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించింది.
అయితే ఈ సినిమాకి రజినీ పారితోషికమే రూ.110 కోట్లట. అంటే సగం పైనే బడ్జెట్ రజినీ పారితోషికానికి అయిపోయినట్టే. ఇప్పటివరకు సౌత్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోలుగా ప్రభాస్, విజయ్ లు మాత్రమే ఉన్నారు. వాళ్ళ పారితోషికం రూ.100 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. ఇప్పుడు రజినీకాంత్ వారి రికార్డ్ ను బ్రేక్ చేసినట్టే..! ప్లాప్స్ పడినా రజినీకాంత్ సినిమాలకి నిర్మాతలు అంత మొత్తం ఎలా ముట్ట చెబుతున్నారు అంటే అది అతని మార్కెట్ ను బేస్ చేసుకునే అని చెప్పాలి.
రజినీకాంత్ సినిమాకి పాజిటివ్ టాక్ కనుక వస్తే రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లు ఈజీగా వస్తాయి. అదే నిర్మాతల బలమైన నమ్మకం. ‘జైలర్’ (Jailer) ట్రైలర్ అయితే ప్రామిసింగ్ గా ఉంది. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈ మూవీ రూ.10 కోట్లు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!