“కబాలి” ఫీవర్….పీక్స్

తమిళ తలైవార్ రజనీకాంత్ సినిమా అంటే ఎగబడి చూసేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. అయితే అదిగో…ఇదిగో అంటూ ఇప్పటివరకు వాయిదా వేసుకుంటూ వచ్చిన తలైవార్ “కబాలి” సినిమా మొత్తానికి ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా వచ్చేస్తుంది అని కన్ఫర్మ్ అవ్వడంతో ఇక అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇక దాదాపుగా బాషా సినిమా తరువాత రజని డాన్ గా కనిపిస్తున్న ఈ కబాలి మీద ముందునుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్స్ అయితే ఆ అంచనాలను తారా స్థాయికి చేర్చాయి. అయితే భారత దేశంలో విషయం పక్కన పెడితే…కబాలి ఫీవర్ మలేషియా సైతం ఊపేస్తుంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం కబాలి ప్రీమియర్స్ కోసం మలేషియాలా భారీ రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. దాదాపు 100 రింగ్గిట్స్ (మలేసియా కరెన్సీ) అంటే దాదాపు మన దగ్గర పదహారు వందల ఇరువై రూపాయల విలువ పెట్టి కబాలి ప్రీమియర్స్ కు ఎగబడుతున్నారట ఇప్పటికే అక్కడ అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ చేశారని.

అయితే దాదాపుగా తొలి రోజుకు టికెట్స్ అన్నీ క్లోస్ అయిపోయాయి అని సైతం తెలుస్తుంది. ఇప్పటికీ ఈ సినిమా బిజినెస్ భారీగా జరిగిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో రజని రేంజ్ కి భయపడి చాలా చిన్న సినిమాలు విడుదలను వాయిదా వేసుకోవడం విశేషం. మరి భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎంతటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus