Vettaiyan: దేవరకు వేట్టయన్ గట్టి పోటీ ఇస్తుందా.. బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే?

సూపర్ స్టార్ రజనీకాంత్ కు (Rajinikanth)  ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రజనీకాంత్ సినిమాలు యావరేజ్ టాక్ తో కూడా సంచలనాలు సృష్టించిన సందర్భాలు అయితే ఉన్నాయి. మరో 36 గంటల్లో వేట్టయన్  (Vettaiyan) మూవీ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవుతోంది. హైదరాబాద్ లో వేట్టయన్ మూవీకి ప్రముఖ మల్టీప్లెక్స్ లలో బుకింగ్స్ బాగానే ఉండటం గమనార్హం అయితే టైర్2, టైర్3 పట్టణాలలో మాత్రం వేట్టయన్ బుకింగ్స్ మరింత పుంజుకోవాల్సి ఉంది.

Vettaiyan

దేవరకు (Devara) వేట్టయన్ గట్టి పోటీ ఇస్తుందా అనే ప్రశ్నకు వేట్టయన్ టాక్ కీలకం కానుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రజనీకాంత్ శైలికి అనుగుణంగా ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ను యాడ్ చేశారని తెలుస్తోంది. వేట్టయన్ మూవీకి తమిళనాడులో బుకింగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. వేట్టయన్ రిలీజ్ వల్ల దేవర తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో థియేటర్లను కోల్పోవాల్సి వస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

వేట్టయన్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ సురేష్ సంస్థ పంపిణీ చేస్తోంది. ఈ సినిమాకు భారీ స్థాయిలోనే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. రజనీకాంత్ సూచనలకు అనుగుణంగా ఈ సినిమా స్క్రిప్ట్ లో మార్పులు జరిగినట్టు తెలుస్తోంది. అనిరుధ్ (Anirudh Ravichander)  మ్యూజిక్, బీజీఎం ఈ సినిమాకు మరింత ప్లస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. వేట్టయన్ లో కమర్షియల్ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వగా రజనీకాంత్ తర్వాత సినిమా లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) డైరెక్షన్ లో తెరకెక్కనుంది.

భారీ స్థాయిలో పారితోషికం అందుకుంటున్న రజనీకాంత్ జైలర్ ను (Jailer)  మించిన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వేట్టయన్ సినిమా దసరా పండుగకు సినిమా చూడాలని కోరుకునే ప్రేక్షకులలో చాలామందికి ఫస్ట్ ఆప్షన్ కాగా టాక్ పాజిటివ్ గా ఉంటే ఈ సినిమా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం పక్కా అని చెప్పవచ్చు.

నిర్మాతగా మారుతున్న సంయుక్త.. అంత గొప్పతనం ఆ కథలో ఏముందబ్బా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus