Samyuktha Menon: నిర్మాతగా మారుతున్న సంయుక్త.. అంత గొప్పతనం ఆ కథలో ఏముందబ్బా!

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని అంటుంటారు పెద్దలు. దీనిని సినిమాల్లోకి కన్వర్ట్‌ చేస్తే ‘క్రేజ్‌ డబ్బులు సంపాదించుకోవాలి’ అని చెప్పొచ్చు. ఇది హీరోలకు కానీ, హీరోయిన్‌లకు కానీ.. ఆ మాటకొస్తే సినిమా వాళ్లందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే సినిమా పరిశ్రమలో ఫేమ్‌ అనేది నీటి బుడగ లాంటిది. ఇలాంటి తక్కువ స్పాన్‌ ఉన్న పరిశ్రమలో హీరోయిన్ల స్పాన్‌ ఇంకా తక్కువ. అలాంటిది హీరోయిన్‌గా ఎదుగుతున్న సమయంలో నిర్మాతగా మారడం అంటే పెద్ద విషయమే కదా.

Samyuktha Menon

ఇప్పుడు ఇదే పని చేయబోతోంది ప్రముఖ నటి సంయుక్త (Samyuktha Menon). మరీ 100 శాతం స్ట్రయిక్‌ రేట్‌ అనలేం కానీ దాదాపు వంద శాతం స్ట్రయిక్‌ రేటుతో సంయుక్త దూసుకుపోతోంది. తెలుగులోకి ఆమె వచ్చినప్పటి నుండి ఆమె ట్రాక్‌ రికార్డు అలానే ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో నిర్మాత అవ్వాలనే ఆలోచన చేస్తోంది. అయితే అది సమర్పకురాలిగానే అనుకోండి. ఇటీవల ఆమె దగ్గరకు హీరోయిన్ ఓరియెంటెడ్ కథ వచ్చిందట. అది నచ్చడంతో ఏకంగా నిర్మాణ భాగస్వామి అవుతా అంటోందట.

నిర్మాత రాజేష్ దండా (Rajesh Danda) గత కొన్ని నెలలుగా ఓ కథను సిద్ధం చేస్తున్నారు. స్టార్‌ హీరోయిన్‌ సమంతతో (Samantha) ఆ సినిమా చేయాలనేది ఆయన ఆలోచన. ఈ మేరకు ప్రయత్నాలు కూడా చేశారు. కానీ సమంత ఇప్పుడు ఆ మూడ్‌లో లేదు అంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ ప్రాజెక్టుల మీదకు ఆమె చూపు మళ్లుతోంది. దీంతో అనదర్‌ ఆప్షన్‌గా సంయుక్తను సంప్రదిస్తే.. ఆమె ఏకంగా నిర్మాణ భాగస్వామి అవుతాను అంటోంది.

మరి అంతలా ఆ కథలో ఏముంది, రాజేశ్‌ దండా అంతగా ఏం రాయించారు అనేది చూడాలి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే దసరా సందర్భంగా సినిమాను అనౌన్స్‌ చేస్తారు అని టాక్‌. ఇక సంయుక్త సినిమాల సంగతి చూస్తే.. నిఖిల్‌ (Nikhil Siddhartha) ‘స్వయంభు’ (Swayambhu)  తోపాటు శర్వానంద్‌ (Sharwanand) సినిమా ఒకటి.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌  (Bellamkonda Sai Sreenivas)  చిత్రం చేస్తోంది. వీటితోపాటు మలయాళ సినిమా ‘రామ్‌’ కూడా ఉంది.

‘విశ్వం’ లో సెన్సార్ కి బలైన 14 సన్నివేశాలు ఇవేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus