‘పేట’ తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల వివరాలు..!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘పేట’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. ‘పిజ్జా’ ఫేమ్ కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రానికి రివ్యూస్.. మౌత్ టాక్ బాగానే వచ్చాయి. అయితే తెలుగులో ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ ‘వినయ విధేయ రామా’ ‘ఎఫ్2’ వంటి క్రేజీ చిత్రాలుండడంతో ‘పేట’ చిత్రాన్ని.. తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. పండుగ ముగిసాక కొన్ని థియేటర్లు పెంచినప్పటికీ.. పెద్దగా ఉపయోగం లేకపోయింది. ఇక తాజాగా ఈ చిత్రం ఫుల్ రన్ పూర్తయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 5.97 కోట్ల షేర్ ను మాత్రమే నమోదుచేసింది.

ఇక ఫుల్ రన్ పూర్తయ్యేసరికి ‘పేట’ ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజామ్ : 2.34 cr
సీడెడ్ : 0.81 cr


ఉత్తరాంధ్ర : 0.74 cr
కృష్ణ : 0.58 cr
గుంటూరు : 0.52 cr


ఈస్ట్ : 0.49 cr
వెస్ట్ : 0.32 cr
నెల్లూరు : 0.15 cr


——————————————————-
ఎపీ + తెలంగాణా టోటల్: రూ. 5.95 cr
——————————————————-

ఇక ఈ చిత్రానికి తెలుగులో 10 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే కేవలం 5.95 కోట్ల షేర్ ని మాత్రమే వసూల్ చేయడంతో.. దాదాపు 40 % బయ్యర్లకు నష్టాలు తప్పలేదు. నిజానికి ‘రోబో’ చిత్రం తరువాత.. తెలుగులో విడుదలైన రజనీకాంత్ చిత్రాలకి లాభాలు రాలేదు. ఇక ‘పేట’ చిత్రాన్ని సంక్రాంతి టైములో కాకుండా.. వేరే టైములో రిలీజ్ చేసుంటే.. కచ్చితంగా లాభాలు వచ్చేవి అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఈ చిత్రంలో ‘వింటేజ్ రజినీని’ ప్రెజెంట్ చేసాడు దర్శకుడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus