ఈ శుక్రవారం అరడజనుకు పైగా సినిమాలు థియటర్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. వాటిలో ముఖ్యంగా మూడు సినిమాలు మూవీ లవర్స్ ని బాగా అట్ట్రాక్ట్ చేసాయి. అందులో ముఖ్యంగా తొలిసారి మూవీని డైరెక్ట్ చేస్తున్న సాయిలు కామ్పాటి రైటర్ & డైరెక్టర్ గా దర్శకత్వం వహిస్తూ వేణు అడుగుల నిర్మాణంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన యూత్ ఫుల్ లవ్ స్టోరీ “రాజు వెడ్స్ రాంభాయి”. అఖిల్ & తేజస్వి రావు హీరో హీరోయిన్లుగా , చైతన్య జొన్నలగడ్డ కీలకపాత్రలో నటించారు. ఈ మూవీ రిలీజ్ కు ముందే ప్రేక్షకులలో మరియు సినీ వర్గాల్లో కూడా మంచి బజ్ ను క్రియేట్ చేసింది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.
ఎందుకు అంటే సురేష్ బొబ్బిలి స్వరాలు అందించిన ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్ రాంబాయి నీ మీద నాకు మనసాయెనే సాంగ్ స్వచ్ఛమైన గ్రామీణ ప్రేమను తెలియపరుస్తూ చాల ఫ్రెష్ గా ఉంది. అదే కాకుండా ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ , చాలా సహజంగా పల్లెలోని అమాయకపు యువతీ యువకుల మధ్య కలిగే ప్రేమను చాలా చక్కగా చూపించారు దర్శకుడు. సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు మాట్లాడుతూ తాను పడ్డ కష్టం వృధా అవ్వదు అని, గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన తనకి మట్టి వాసన తాలూకా ప్రేమ అనుబందాలు గురించి బాగా తెలుసునని,
దయచేసి సినిమా చూడకుండా నెగెటివ్ రివ్యూలు రాయొద్దని, ఒకవేళ సినిమా చూసాక కూడా నెగెటివ్ గా అనిపిస్తే అమీర్ పేట్ సెంటర్లో కట్ డ్రాయర్ మీద ఉరుకుతా అని అగ్రెసివ్ గా మాట్లాడడంతో డైరెక్టర్ కాన్ఫిడెన్స్ కి ఫిదా అవటంతో మూవీ లవర్స్లో సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ అయింది.దాంతో పాటు నిర్మాతలు కూడా చాలా వరకు థియేటర్లలో 99రూ. లకు టికెట్ రేట్లను అందుబాటులో ఉంచారు.
దీంతో సినిమా ట్రేడ్ వర్గాల నిపుణులు ఈ సినిమాకు ఉన్న బజ్ కు & అందుబాటులో టికెట్ ధరలు కూడా ఉండటంతో ఈ మూవీ ఈజీగా కలెక్షన్లు సాధించటమే కాక, నిర్మాతలకి లాభాలు తెచిపెడ్తుంది అని భావించారు. అదే విధంగా మొదటి రోజు బుకింగ్స్ కూడా బాగా అయ్యాయి. కానీ అంచనాలకు అనుగుణంగా కలెక్షన్లు మాత్రం రావట్లేదు అని టాక్. మొత్తం మీద ఈ మూవీ 3 కోట్ల షేర్ , 6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తేనే బ్రేక్ ఈవెన్ అవుతుందంట. మౌత్ టాక్ పాజిటివ్ గానే వస్తుండగా, ఈ వీకెండ్ రెండు రోజులలో వచ్చే కలెక్షన్స్ బట్టి ఈ సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంది. మరి రాజు వెడ్స్ రాంబాయి మూవీ ట్రేడ్ వర్గాల అంచనాను ఎంతవరకు అందుకుంటుందో ఈ రెండు రోజుల్లో తెలిసిపోతుంది…..!