Rakshana Review in Telugu: రక్షణ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • రోష‌న్‌ (Hero)
  • పాయల్ రాజ్ పుత్ (Heroine)
  • మాన‌స్‌ నాగులాపల్లి, రాజీవ్ క‌న‌కాల‌, వినోద్ బాల‌, శివ‌న్నారాయ‌ణ తదితరులు (Cast)
  • ప్రణదీప్ ఠాకూర్ (Director)
  • ప్రణదీప్ ఠాకూర్, (Producer)
  • మహతి స్వర సాగర్ (Music)
  • అనిల్ బండారి (Cinematography)
  • Release Date : జూన్ 07, 2024

పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘రక్షణ’ (Rakshana) . పెద్దగా చప్పుడు లేకుండా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం రండి :

కథ:  కిరణ్ (పాయల్) ప్రియా బెస్ట్ ఫ్రెండ్స్. ప్రియా స్టడీస్ కంప్లీట్ చేసి మంచి ఉద్యోగం సంపాదిస్తుంది. మరోపక్క కిరణ్ కూడా పోలీస్ ఉద్యోగం సంపాదిస్తుంది. దీంతో ఆమె కుటుంబం, కిరణ్ కుటుంబం సంతోషంతో సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి టైంలో ఓ రోజు ప్రియా సూసైడ్ చేసుకుని చనిపోతుంది. దీంతో కిరణ్ షాక్ కి గురవుతుంది. కొన్నాళ్ల తర్వాత కిరణ్ ఏసీపీ అవుతుంది. ఆ తర్వాత కూడా కొంతమంది అమ్మాయిలు ఏదో ఒక రకంగా చనిపోతూ ఉంటారు. ఓ అమ్మాయి కార్ యాక్సిడెంట్లో చనిపోతుంది. ఇంకొంతమంది అమ్మాయిలు ప్రమాదవశాత్తు చనిపోతారు. కానీ వీటన్నిటి వెనుక ఎవరో ఉన్నారు అనేది కిరణ్ అనుమానం.

తన స్నేహితురాలు చనిపోయినప్పుడు కూడా ఓ అజ్ఞాత వ్యక్తి లాలీపప్ తింటూ ఆమెకు కనిపిస్తాడు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. తన స్నేహితురాలిని.. మిగిలిన అమ్మాయిలని చంపింది ఎవరు అనే విషయం పై కిరణ్ దర్యాప్తు చేపడుతుంది. పై అధికారుల నుండి ఒత్తిడి వచ్చినా ఆమె తగ్గదు. ఇలాంటి టైంలో ఈవ్ టీజింగ్ కేసులో అరుణ్ (మానస్ నాగులపల్లి) అనే స్టూడెంట్ ని ఆమె అరెస్ట్ చేస్తుంది. అయితే… అతని కెరీర్ డిస్టర్బ్ అవ్వకుండా వార్నింగ్ ఇచ్చి వదిలేస్తుంది. అయినా సరే అరుణ్.. కిరణ్ పై కోపం పెంచుకుంటాడు.

అదే టైంలో కిరణ్ ఫోటో, ఫోన్ నెంబర్ .. కాల్ గర్ల్ వెబ్ సైట్లో ఉంటాయి. ఆ వెబ్ సైట్ చేసింది అరుణ్ అనేది కిరణ్ అనుమానం. దీంతో అతని పై ఫోకస్ పెడుతుంది. పైగా అతను కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. ఈ క్రమంలో అతని ఆచూకీ తెలుసుకుని.. నిర్మాణ దశలో ఉన్న ఓ బిల్డింగ్ వద్దకి వెళ్తుంది కిరణ్. అప్పుడు అతను పై అంతస్తు నుండి అరుణ్ కింద పడి చనిపోతాడు. కిరణ్ వల్లే అతను సూసైడ్ చేసుకున్నాడు అని ఆమెను సస్పెండ్ చేస్తారు పై అధికారులు. మరి ఈ కేసుని ఆమె ఎలా సాల్వ్ చేసింది. అసలు ఈ హత్యలు చేసింది ఎవరు? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు : పాయల్ రాజ్ పుత్ గ్లామర్ షోతో ఏ రేంజ్లో ఆకర్షించగలదో.. అదే విధంగా పెర్ఫార్మన్స్ తో కూడా ఆకట్టుకోగలదు. ‘ఆర్.ఎక్స్.100’ ‘మంగళవారం’ సినిమాలతో అది ప్రూవ్ అయ్యింది. మళ్ళీ ఆమెకు ఈ సినిమా ద్వారా నటనకు స్కోప్ ఉన్న పాత్ర దొరికింది.ఇందులో కూడా తన ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ తో పాయల్ ఆకట్టుకుంది అని చెప్పాలి. యాక్షన్ సీన్స్ లో కూడా బాగా చేసింది. భవిష్యత్తులో ఇలాంటి సెటిల్డ్ రోల్స్ కి తానున్నానని పాయల్ ఈ చిత్రంతో మరోసారి గుర్తుచేసింది.

తర్వాత ‘బిగ్ బాస్’ మానస్ కి కూడా మంచి పాత్ర దొరికింది. అతను కూడా తగ్గలేదు. తన బెస్ట్ ఇచ్చాడు అని చెప్పవచ్చు. సాఫ్ట్ గా కనిపించినా కన్నింగ్ రోల్స్ కూడా చేయగలను అని నిరూపించుకున్నాడు. రోషన్ చాలా టిపికల్ రోల్ ప్లే చేశాడు. శివన్నారాయణ, రాజీవ్ కనకాల (Rajiv Kanakala) ,చక్రపాణి ఆనంద (Chakrapani Ananda) .. వంటి వారు చిన్న చిన్న పాత్రల్లో పర్వాలేదు అనిపించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు : ‘స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కానీ పురుషులు స్త్రీని ఏ విధంగా చూస్తున్నారు? వాళ్ళ సక్సెస్ ని పురుషులు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అసలు స్త్రీని సమాజం వేరు చేసి ఎందుకు చూస్తుంది.? స్త్రీకి శక్తి తక్కువే అయ్యుండొచ్చు కానీ ఓపిక మాత్రం ఎక్కువే’ అనే అంశాలతో ఈ కథని రాసుకున్నాడు దర్శకుడు ప్రణదీప్ ఠాకూర్. కమర్షియల్ లెక్కల్ని దృష్టిలో పెట్టుకుని దీనిని ఓ పోలీస్ ఇన్వెస్టిగేటివ్ కమ్ మిస్టరీ థ్రిల్లర్ గా ఆవిష్కరించాలి అనుకున్నాడు. అతని ప్రయత్నం మెచ్చుకోదగినదే.

కానీ టేకింగ్ కూడా గ్రిప్పింగ్ గా ఉండాలి. ఫస్ట్ హాఫ్ బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. కానీ సెకండ్ హాఫ్ స్లోగా సాగింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇంకాస్త ఉంటే బాగుణ్ణు అనిపిస్తుంది. క్లైమాక్స్ మళ్ళీ ఓకే అనిపిస్తుంది. టెక్నికల్ గా పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు లేకపోవడం ఓ విధంగా ప్లస్ పాయింట్ అని చెప్పాలి.

విశ్లేషణ : పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారు.. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే.. ‘రక్షణ’ పర్వాలేదు అనిపించే సినిమానే అని చెప్పాలి.

ఫోకస్ పాయింట్ : థ్రిల్లర్ ప్రియుల కోసం

రేటింగ్ : 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus