Rakul Preet: రకుల్ కాబోయే భర్త అతడే.. స్పెషల్ పిక్

గ్లామరస్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌లో తన కలలను సాకారం చేసుకోవడానికి టాలీవుడ్‌కు కాస్త డిస్టన్స్ మెయింటైన్ చేస్తోంది. వీలైనంత వరకు కొన్ని పెద్ద సినిమాలను ఎంచుకుంటుంది. ఇక ఆమె చేతిలో కొన్ని పెద్ద ప్రాజెక్ట్‌లపైనే కాకుండా ప్రేమ జీవితం గురించి అప్పుడప్పుడు పుకార్లు వస్తున్నాయి. ఇక మొత్తానికి ఆమె తన ప్రేమ జీవితంపై ఒక క్లారిటీ ఇచ్చేసింది. ఈరోజు (అక్టోబర్ 10) తన పుట్టినరోజు సందర్భంగా, 31 ఏళ్ల నటి తన బాయ్‌ ఫ్రెండ్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది.

ఆమె తాజా ఇన్‌స్టాగ్రామ్ లో ఒక ఫొటో కూడా పోస్ట్ చేసింది. బాలీవుడ్ యువ హీరో జాకీ భగ్నాని తన నిజమైన ప్రేమ అని ఆమె వెల్లడించింది. ఈ సంవత్సరం అతడిని ‘బహుమతి’గా కనుగొన్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ రకుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా వ్రాసింది.. థాంక్యూ యూ మై లవ్! మీరు ఈ సంవత్సరం నాకు అతిపెద్ద బహుమతి! నా జీవితానికి రంగులు జోడించినందుకు ధన్యవాదాలు. నన్ను నిరంతరం నవ్వించినందుకు ధన్యవాదాలు.. అంటూ వివరణ ఇచ్చింది.

ఇక ఈ ప్రేముకులు విదేశాలలో ఒక పార్కులో నడుస్తున్నట్లు కనిపించే ఫొటోను కూడా షేర్ చేసుకున్నారు. జాకీ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ సందేశాన్ని వ్రాసి ప్రపంచానికి వారి ప్రేమ సంబంధాన్ని తెలియజేశాడు. మొత్తానికి రకుల్ తన ప్రేమ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వడంతో గతంలో వచ్చిన రూమర్స్ అన్ని కూడా అబద్దాలు అని తెలిపోయాయి. ఇక ఇటీవల రకుల్ తెలుగులో కొండపొలం అనే సినిమా చేసిన విషయం తెలిసిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus