కోటి క్లబ్ లో రకుల్ ప్రీత్ సింగ్..!!

బ్రూస్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్ దశ తిరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే అవకాశం దక్కించుకోవడంతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిన ఫిట్ నెస్ సుందరి .. తాజాగా కోటి క్లబ్ లో చేరింది. కమర్షియల్ డైరక్టర్ ఏ.ఆర్. మురుగ దాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించనున్న ఈ సినిమాకు తొలుత హీరోయిన్ గా  బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాను అనుకున్నారు.

డేట్స్ సర్దుబాటు చేయలేని కారణంగా ఆమె పక్కకు తప్పుకుంది. ఆ అవకాశాన్ని రకుల్ ప్రీత్ సింగ్ దక్కించుకుంది. 90 కోట్లతో తెలుగు తమిళం భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం పరిణీతికి 3 .5 కోట్లను రెమ్యునరేషన్ గా ఇవ్వాలని నిర్మాతలు  భావించారు. ఆ బడ్జట్ భారాన్ని కూడా రకుల్ తగ్గించింది. కోటి రూపాయలకే బల్క్ డేట్స్ కేటాయించింది. దీంతో ప్రొడక్షన్ కాస్ట్ తగ్గినందుకు అటు నిర్మాతలు సంతోషంగా ఉన్నారు.

ఇటు కోటి తో తన రేంజ్ పెంచినందుకు రకుల్ ఆనందపడుతోంది. తమిళ డైరక్టర్, నటుడు ఎస్,జె.సూర్య విలన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఈనెల 29 నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక భారీ సెట్ లో మహేష్, రకుల్ పై పాటను చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత చిత్ర యూనిట్ పూణెకి వెళ్లనుంది. అక్కడే నెల రోజుల పాటు కీలక సన్నివేశాలను సూట్ చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus