ఫిలిం ఫేర్ మ్యాగజిన్ కోసం అందాలు ఆరబోసిన రకుల్!

హీరోయిన్స్ కి అభినయంతో పాటు అందం కూడా ప్రధాన బలం. అయితే అందాన్ని ఆకర్షణీయంగా ప్రదర్శించడంలోనే అసలైన కిటుకు దాగుంది. ఆ కిటుకు బాగా తెలిసిన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో ధృవ, నాన్నకు ప్రేమతో, సరైనోడు వంటి హ్యాట్రిక్ హిట్ అందుకున్న తర్వాత.. బాలీవుడ్ లోను అవకాశాలు అందుకుంది. స్పైడర్ సినిమా ద్వారా తమిళంలోనూ అడుగు పెట్టింది. కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ తెలుగులో రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తోంది. అంతకంటే ముందు ఇండస్ర్టీ వర్గాలకోసం ఓ ఫోటో షూట్ చేసింది. ఫిలిం ఫేర్ మ్యాగజైన్ కోసం అందాలను ఆరబోసింది. శరీరాన్ని పూర్తిగా మార్చుకొని.. అదిరిపోయే ఫ్యాషన్ దుస్తుల్లో అందానికి ఐకాన్ గా నిలిచింది. ఈ ఫోటో షూట్ కి సంబంధించిన ఓ వీడియో యూట్యూబ్ లో రిలీజ్ అయి వైరల్ అయింది.

ఇందులో రకుల్ తన అందాలతో యువకులను కైపెక్కిస్తోంది. ఈ వీడియోలో రకుల్ ని చూసిన వారందరూ.. రకుల్ చాలా మారిపోయిందని ప్రసంశలు గుప్పిస్తున్నారు. ఈ దెబ్బతో భాషలతో సంబంధంలేకుండా చేతి నిండా సినిమాల్తో బిజీ కావడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ భామ నాగచైతన్యతో రారండోయ్ వేడుక చూద్దాం సినిమా చేసింది. ఇందులో వీరిద్దరి జోడీ బాగా నచ్చింది. అందుకే దర్శక నిర్మాతలు ఈ జోడీని మళ్ళీ వెండితెరపై చూపించాలని అనుకుంటున్నారు. అన్ని కుదిరితే  రకుల్ తెలుగులో రీ ఎంట్రీ త్వరలోనే ఉండబోతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus