Rakul Preet Car Cost: మరో ఖరీదైన కారును కొనుగోలు చేసిన రకుల్.. కారు ఖరీదు అన్ని రూ.కోట్లా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ పరిమితంగా సినిమాలలో నటిస్తుండగా ఆ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇతర భాషలపై రకుల్ ప్రీత్ సింగ్ దృష్టి పెట్టగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం రకుల్ ప్రీత్ సింగ్ అంచనాలకు మించి సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. కొత్త కారు ముందు రకుల్ ఫోటోలు దిగగా ఆ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. లగ్జరీ కారును కొనుగోలు చేసిన ఆనందంలో రకుల్ ప్రీత్ సింగ్ స్వీట్లు పంచారు.

తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet) రీఎంట్రీ వచ్చి వరుస సినిమాలతో బిజీ కావడంతో పాటు వరుస విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరిక కాగా రకుల్ మనస్సులో ఏముందో తెలియాల్సి ఉంది. లగ్జరీ బెంజ్ కారును రకుల్ ప్రీత్ సింగ్ కొనుగోలు చేయగా ఈ కారు ఖరీదు ఏకంగా 3 కోట్ల రూపాయలుగా ఉంటుందని సమాచారం. స్పైడర్, మన్మథుడు2 సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోకపోవడం వల్లే రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ పరంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందులు పడుతున్నారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీని హీరోయిన్ల కొరత వేధిస్తున్న నేపథ్యంలో సరైన ప్రాజెక్ట్ తో రీఎంట్రీ ఇస్తే రకుల్ కెరీర్ కు ఢోకా ఉండదని చెప్పవచ్చు. ఒక్కో సినిమాకు 3 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో రకుల్ ప్రీత్ సింగ్ పారితోషికం తీసుకుంటున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.

ఇతర స్టార్ హీరోయిన్లతో కూడా రకుల్ ప్రీత్ సింగ్ స్నేహపూర్వకంగా మెలుగుతారు. రకుల్ కెరీర్ ప్లానింగ్ సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని తెలుస్తోంది. రకుల్ కు 2024 సంవత్సరం కెరీర్ పరంగా మరింత కలిసిరావాలని ఆమె మరిన్ని విజయాలను అందుకోవాలని అభిమానులు ఫీలవుతున్నారు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus