తన ఫోటోలకు, మెసేజ్ లకు రిప్లై ఇవ్వొద్దని చెప్పిన రకుల్

ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు మరింత నాజూగ్గా తయారైంది. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవితంపై తీస్తున్న బయోపిక్ లో అతిలోకసుందరి శ్రీదేవి పాత్రలో మెరవబోతోంది. బాలకృష్ణతో కలిసి ఆకుచాటు పిందె తడిసె పాటలో స్టెప్పులు వేస్తోంది. మంచి సినిమాలో ఛాన్స్ వచ్చిందని ఆమె సంబరపడుతుంటే.. ఇదే అదనుగా భావించి హ్యాకర్స్ రకుల్ ప్రీత్ సింగ్‌ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ని హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకొని మొదట కంగారు పడింది. ఆ తర్వాత తేరుకొని తన అభిమానులకు తప్పుడు సంకేతాలు వెలుతాయోమోనని భావించి.. ట్విట్టర్ వేదికపై హయక్ అయిన విషయాన్ని వెల్లడించింది. “నా ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్ ను ఎవరో హాక్ చేశారు. హ్యాక్ నుంచి రికవరీ అయ్యేంత వరకూ దయచేసి నా ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్ లో వచ్చే లింక్స్‌ ని క్లిక్ చెయ్యకండి…

అలాగే ఏవైనా మెసేజ్ లు వచ్చిన వాటికీ ఎవ్వరూ స్పందించంకండి” అని రకుల్ తనని ఫాలో అయ్యే అభిమానులను స్పష్టం చేసింది. తెలుగులో ఒక సమయంలో ధృవ, నాన్నకు ప్రేమతో, సరైనోడు వంటి హ్యాట్రిక్ హిట్ అందుకున్న రకుల్ బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంది. స్పైడర్ సినిమా ద్వారా తమిళంలోనూ అడుగు పెట్టింది. కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ తెలుగులో రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తోంది. గత ఏడాది ఈ భామ నాగచైతన్యతో రారండోయ్ వేడుక చూద్దాం సినిమా చేసింది. ఇందులో వీరిద్దరి జోడీ బాగా నచ్చింది. అందుకే దర్శక నిర్మాతలు ఈ జోడీని మళ్ళీ వెండితెరపై చూపించాలని అనుకుంటున్నారు. అన్ని కుదిరితే రకుల్ తెలుగులో రీ ఎంట్రీ త్వరలోనే ఉండబోతోంది.’

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus