అలాంటి వారి ప్రయత్నాలు ఫలించవు : రకుల్

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందనేది చెప్పలేము. ఎంత టాలెంట్ ఉన్నా, అందాల ఆరబోత ఎంత చేసినా… సక్సెస్ లు లేకపోతే ఆ హీరోయిన్ ను దర్శక నిర్మాతలు పెద్దగా పట్టించుకోరనడంలో సందేహం లేదు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ పరిస్థితి కూడా అలానే ఉంది. ‘కెరటం’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన రకుల్.. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ ‘లౌక్యం’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కాయి. అయితే పెద్దగా సక్సెస్ లు మాత్రం రాలేదు. ‘నాన్నకు ప్రేమతో’ ‘సరైనోడు’ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ‘ధృవ’ వంటి చిత్రాలు సక్సెస్ అయినా… ‘బ్రూస్ లీ’ ‘విన్నర్’ ‘జయ జానకి నాయకా’ ‘స్పైడర్’ వంటి చిత్రాలు నిరాశపరచడంతో ఆఫర్లు రాక కోలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ కూడా ఈ అమ్మడికి పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషలతో పాటూ హిందీలో కూడా రకుల్ నటిస్తోంది. హిందీలో అక్షయ్‌కుమార్‌కు సరసన ఓ చిత్రంలో నటిస్తోంది.

ఇదిలా ఉండగా ప్లాపుల్లో ఉండి అవకాశాలు లేనప్పటికీ… రకుల్ తన రెమ్యూనరేషన్ ను పెంచేసిందనే టాక్ నుడుస్తుంది. అంతే కాదు కోలీవుడ్లో రకుల్ ఐరన్ లెగ్ అని… తనకి అక్కడ కూడా ఆఫర్లు రావట్లేదని సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీని పై తాజాగా రకుల్ స్పందించింది. రకుల్ మాట్లాడుతూ… “మూడు భాషల్లో నటించే అతి కొద్ది మంది హీరోయిన్లలలో నేనూ ఒకరిని కావడం సంతోషంగా ఉంది. అయితే నా ఎదుగుదలను అడ్డుకోవడానికి కొందరు సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారి ప్రయత్నాలు ఫలించవు, అయినా అలాంటి తప్పుడు ప్రచారం గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు” అంటూ వివరణ ఇచ్చింది రకుల్. తెలుగులో నాగార్జున- రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్లో తెరేకేక్కుతున్న ‘మన్మథుడు 2’ చిత్రంలో కూడా రకుల్ హీరోయిన్ గా నటిస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus