కుర్ర హీరోతో రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమ వ్యవహారం
- January 17, 2017 / 08:00 AM ISTByFilmy Focus
ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ వరుస హిట్లతో దూసుకుపోతోంది. గత ఏడాది ఆమె నటించిన నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ సినిమాలు బ్లాక్ బస్టర్ కావడంతో చాలా ఆనందంగా ఉంది. రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోను మంచి తోడు దొరకడంతో జోష్ మీద ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె ఓ మెగా హీరో తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు ఫిల్మ్ నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. వీరిద్దరూ కాస్త సమయం చిక్కినా ప్రేమ పక్షుల్లా విహరిస్తున్నారని తెలిపారు. ఇంతకీ రకుల్ మనసు దోచుకున్న యంగ్ హీరో మరెవరో కాదు సాయి ధరమ్ తేజ్ అంట. తేజు తో ఫిట్ బ్యూటీ విన్నర్ మూవీలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, ఇప్పుడు పీకల్లోతు ప్రేమలో ఉన్నారని రూమర్ చక్కర్లు కొడుతోంది.
గోవాలోని ఓ ఐ ల్యాండ్ లో జనవరి ఫస్ట్ వేడుకలను అఖిల్ శ్రీయా, నాగ చైతన్య సమంత లతో కలిసి ఈ జంట సూపర్ గా ఎంజాయ్ చేసిన్నట్లు వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. ఈ విషయంపై రకుల్, సాయి ధరమ్, వారి వ్యక్తిగత సిబ్బంది స్పందించలేదు. రకుల్ ప్రస్తుతం విన్నర్ మూవీతో పాటు మహేష్ బాబు సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. అలాగే తిక్క ఫెయిల్ కావడంతో విన్నర్ తో ఎలాగైనా హిట్ కావాలని తేజు శ్రమిస్తున్నారు. ప్రతి సీన్ అద్భుతంగా రావాలని తపిస్తున్నారు. ఇంత బిజీగా ఉన్న వీరిద్దరి మధ్య ప్రేమ గాసిప్ ఎలా వచ్చిందో తెలియడం లేదు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















