బాలీవుడ్ పై ఆశలు పెట్టుకున్న రకుల్ ప్రీత్ సింగ్

ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కి 2016 బాగా కలిసి వచ్చింది. ఆమె టాలీవుడ్ లో చేసిన చిత్రాలు నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ విజయం సాధించాయి. 2017 లో స్పైడర్ సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మహేష్, మురుగదాస్ కలయికలో వచ్చిన ఈ చిత్రంతో తమిళంలో మంచి అవకాశాలు పట్టేయాలని కష్టపడింది. కానీ ఆశ నిరాశ అయింది. ఆ చిత్రంతో పాటు తెలుగులో ఆమె నటించిన చిత్రాల్లో రారండోయ్ వేడుక చూద్దాం మినహాయించి అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయితే బాలీవుడ్ లో మళ్ళీ ఛాన్స్ అందుకోవడం ఆమెను సంతోషపెట్టింది. మూడేళ్ల క్రితం యారియా అనే చిత్రంలో రకుల్‌ నటించింది. అయినా అక్కడ స్థిరపడలేకపోయింది. ఈ సారి బాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తోంది. ఆమె నటిస్తున్న తాజా బాలీవుడ్‌ చిత్రం అయ్యారీ షూటింగ్‌ పూర్తికావచ్చింది.

ఆర్మీ నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో రకుల్‌తో పాటు సిద్ధార్థ మల్హోత్రా, మనోజ్‌బాజ్‌పాయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నీరజ్‌పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం “కోయి కహానీ ఘరూ తో కర్‌” అంటూ సాగే పాటను రకుల్‌తో పాటు ఐదువేల మంది విద్యార్థులపై చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 4 నుంచి పిళ్లై కాలేజీలో ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. మిగిలిన కార్యక్రమాలను పూర్తిచేసి, ఈ నెల 26న రిపబ్లిక్‌ డే సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు వస్తాయని రకుల్‌ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రం హిట్ అవ్వాలని జోరుగా ప్రచార కార్య క్రమంలో పాల్గొంటోంది. హిందీలో సల్మాన్‌ఖాన్‌ వ్యాఖ్యాతగా రూపొందుతున్న బిగ్‌బాస్‌ గేమ్‌ షోలో కూడా పాల్గొనబోతున్నట్లు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus