2013లో వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో తెలుగు అభిమానులకు పరిచయమైంది పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్‌లోని అగ్రకథానాయకులతో నటించి మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. తెలుగులోనే కాదు అటు హిందీ, కన్నడ, తమిళ భాషల్లోను ప్రేక్షకులను అలరించింది. ఈ ఏడాదిలో విడుదలైన ‘ఛత్రివాలి’, ‘భూ’, ‘ఐ లవ్ యూ’ లాంటి సినిమాలో భిన్నమైన పాత్రలు పోషించి చిత్రపరిశ్రమలో మంచి స్థాయికి చేరుకుంది. నటిగా ముందుకు సాగుతూ పాన్ ఇండియా రీచ్‌లో అభిమానులను సొంతం చేసుకున్న రకుల్ వివిధ భాషల్లో నటించడానికి వచ్చిన అవకాశం గురించి మాట్లాడుతూ…
‘ఒక నటిగా నా జీవితంలో ఇది ఉత్తేజకరమైన దశ. అన్ని భాషల్లో సినిమాలు చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. అలాంటి అవకాశాలు వస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. సరిహద్దులు దాటుతూ…భాషతో సంబంధం లేకుండా కథతో ప్రేక్షకులతో మాట్లాడే అవకాశం సినిమాల వల్ల రావడం చాలా సంతోషం’ అని తెలిపింది. ‘నా రాబోయే చిత్రాలన్నీ వివిధ భాషల్లో ఉంటాయి. ‘మేరి పత్ని కా రీమేక్’, ‘భారతీయుడు 2’, ‘అలయాన్’ లాంటి సినిమాలు కొన్ని చిత్రీకరణలో ఉండగా మరికొన్ని విడుదలకు సిద్ధమవుతున్నాయి.
అభిమానులు ఆ సినిమాలు చూస్తూ ఎలా అనుభూతి చెందుతారో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది. ఎప్పటిలాగే నాపై ప్రేమను చూపుతూనే ఉంటారని ఆశిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది రకుల్. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో ఎన్టీఆర్, రాంచరణ్, బన్నీ, మహేష్ లాంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. సరైనోడు, ధృవ, నాన్నకు ప్రేమతో లాంటి హిట్స్ ని ఖాతాలో వేసుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ తో, నటనతో సౌత్ లో స్టార్ గా ఎదిగింది.
ఆ మధ్యన డ్రగ్స్ కేసు వివాదం కూడా రకుల్ ని ఇబ్బంది పెట్టింది. ప్రస్తుతం రకుల్ తన సినిమాలపై ఫోకస్ పెడుతూ బాలీవుడ్ లో రాణించే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉండగా బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు గత ఏడాది రకుల్ (Rakul Preet) ప్రకటించింది. వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా తమ రిలేషన్ షిప్ ని అఫీషియల్ గా ప్రకటించారు.