‘మెగాజపం’ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్

  • March 1, 2016 / 06:34 AM IST

అందాల భామ తమన్నా బాటనే అనుసరిస్తుంది రకుల్. మీకు గుర్తుందో లేదో గతంలో తమన్నా కూడా వరుసగా మెగా హీరోలతో సినిమా చేస్తూ, మెగా ఫ్యామిలీకి ఆస్థాన హీరోయిన్ గా మారిపోయింది. ఒకానొక సమయంలో చిరు 150వ సినిమాలో కూడా తమన్నానే కావాలి అన్నంతగా ఆమె మెగా ఫ్యామిలీకి దగ్గరైపోయింది. అయితే ఆ తరువాత వచ్చిన మరో అందాలా భామ రకుల్ కూడా అదే బాటను అనుసరిస్తున్నట్లు అనిపిస్తుంది అంటున్నారు టాలీవుడ్ విశ్లేషకులు.

ఎందుకంటే రకుల్ ఇప్పటికే మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తో బ్రూస్ లీ లో ఆడిపాడింది, ఇక బన్నీతో సరైనోడులో జతకట్టింది. మరో పక్క బ్రూస్ లీ సినిమాలో ఒక షాట్ లో చిరుతో కూడా కనిపించింది. ఇక మరో సినిమాలో చెర్రీతో మళ్లీ జతకట్టడానికి రెడీ అయిపోయింది. ఇంతవరకూ బాగానే ఉంది, ఇప్పుడు ఆమె కన్ను సాయి ధర్మ తేజ, వరుణ్ తెజ్ ల పై కూడా పడింది. అదేలా అంటారా…సాయిధ‌ర‌మ్, గోపీచంద్ మ‌లినేని క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది.

ఈ చిత్రాన్ని ఠాగూర్ మ‌ధు నిర్మిస్తున్నాడు. రానున్న ఏప్రిల్ నెలలో ఈ చిత్రం షూటింగ్ మొద‌లు కానుంది. ఇక ఈ సినిమాలో కూడా క‌థానాయిక‌గా ర‌కుల్‌ని ఎంచుకొన్న‌ట్టు తెలుస్తోంది. అంతేకాకుండా వ‌రుణ్‌తేజ్ రాబోయే సినిమాలోనూ ర‌కుల్‌నే క‌థానాయిక‌గా తీసుకున్నారని టాక్. ఇలా అందరినీ కవర్ చేసేసిన రకుల్, ఇక మన పవర్ స్టార్ తో కూడా జతకడితే….మెగా ఫ్యామిలీ హీరోలందరిని ఒక రౌండ్ వేసినట్టు ఉంటుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus