సరికొత్త కధతో వస్తున్న…మెగా పవర్ స్టార్!!!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ హీరోల క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు…..వాళ్లకున్న ఫ్యాన్ బేస్… మామోలు ఫ్యాన్ బేస్ కాదు…..బాస్ అంటే ప్రాణాలు ఇచ్చే అంత ఫ్యాన్ బేస్…అయితే అదే క్రమంలో కుటుంభంలో ఎలాంటి డిఫరెన్సస్ ఉన్నప్పటికీ….పైకి మాత్రం అంతా ఒకటే అన్నట్లు ఉంటారు…ఇదిలా ఉంటే మరో పక్క టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకడైన సుకుమార్….ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరన్ తేజతో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే…అదే క్రమంలో ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న క్రేజీ డైరక్టర్స్ లో సుకుమార్ ఒకడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు….. అదే క్రమంలో హీరోస్ ను స్టైలిష్ గా చూపించే ఫార్ములా సుకుమార్ నుంచి నేర్చుకోవచ్చు అనే చెప్పాలి…ఇదిలా ఉంటే సుకుమార్ మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా చేస్తున్న ఈ సినిమా రీసెంట్ గా ముహుర్తం పెట్టుకున్న త్వరలో సెట్స్ మీదకు వెల్లబోతుంది.

అయితే ఈ క్రమంలో సినిమా సినిమా కథ లీక్ అయినట్టు టాక్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమాకు టైటిల్ గా రేపల్లె అని పెట్టబోతున్నారట. పల్లెటూరి ప్రేమకథ అని చెబుతూ లీక్ అయిన కథ.. దానితో పాటు బయటకు వచ్చిన ఈ టైటిల్ కూడా సినిమా మీద మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. ఇక అదే క్రమంలో నాన్నకు ప్రేమతో తర్వాత సుక్కు చేస్తున్న సినిమాగా.. ధ్రువ తర్వాత చెర్రి చేస్తున్న సినిమాగా ఈ రేపల్లె అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది అని టాక్….అంతేకాదు….ఈ సినిమా చెర్రీ లుక్ చాలా స్పెషల్ గా కనిపిస్తుంది అంటున్నాడు సుక్కు భాయ్. మరి ఈ పల్లెటూరి ప్రేమకథతో వస్తున్న రాం చరణ్ సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి. అసలే ఒక పల్లెటూరి కధతో చేతులు కాల్చుకున చెర్రీ….మళ్లీ అదే ఫార్మాట్ లో సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో…జస్ట్ వెయిట్ అండ్ సీ!!!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus