చరణ్ బర్త్ డే.. వరుణ్ తేజ్ స్పెషల్ వీడియో!

మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో అభిమానులు రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియాలో చాలా హడావిడి చేస్తున్నారు. రామ్ చరణ్ సినిమా పోస్టర్లు, స్టిల్స్ ను షేర్ చేస్తూ అడ్వాన్స్ గా శుభాకాంక్షలు చెప్పేస్తున్నారు. రీసెంట్ గా అభిమానుల కోసం సాయి ధరమ్ తేజ్ కామన్ డీపీని విడుదల చేశాడు. ‘ఎవ‌డు’ సినిమాలోంచి ఒక ఫొటో తీసి వెనుక ఒక స్టార్ పెట్టి ఇదే సీడీపీ అంటూ వ‌దిలేశారు. అది చూసి చ‌ర‌ణ్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.

ఎలాంటి క్రియేటివిటీ లేకుండా ఓ సాదాసీదా ఫోటోను వదిలారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారిని కూల్ చేయడానికి యానిమేటెడ్ మోషన్ పోస్టర్ మీద స్పెషల్ కేర్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ మోషన్ పోస్టర్ ను వరుణ్ తేజ్ విడుదల చేశాడు. ఇందులో చరణ్ యానిమేషన్ క్యారెక్టర్ నిప్పుల మధ్యలో నుండి దూకుతున్నట్లు కనిపిస్తుంది. ‘ఆర్ఆర్ఆర్’లో నిప్పుకి ప్రతీకగా రామ్ చరణ్ ను చూపించడంతో మోషన్ పోస్టర్ లో కూడా నిప్పుని ప్రధానంగా ఎన్నుకున్నారు.

డీపీ కంటే ఈ వీడియో చాలా బెటర్ గా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’లో అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. చరణ్ పుట్టినరోజుని పురస్కరించుకొని ఫ్యాన్స్ కోసం ఈరోజు 4 గంటలకు రామరాజు లుక్ ను విడుదల చేయబోతుంది చిత్రబృందం.


ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!
ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్లుగా చేసిన వాళ్ళే..!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus