తన భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి ఈరోజు స్పెషల్ డే. తన ప్రేయసి, భార్య అయిన ఉపాసన పుట్టినరోజు. ఈ ప్రత్యేక రోజుని మరింత స్పెషల్ గా మార్చారు రామ్ చరణ్. ఉపాసనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. సోషల్ మీడియా వేదికగా విషెష్ తెలిపారు. అంతేకాదు ఉపాసనతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు. ఈ ఫొటోను పోస్ట్‌ చేసిన అరగంటలో 20 వేల రియాక్షన్స్‌ వచ్చాయి. మెగా అభిమానులు కూడా ఉపాసనకు శుభాకాంక్షలు చెప్పారు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ ‘రంగస్థలం 1985’లో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.

మూడో షెడ్యూల్ ఈనెల 24 నుంచి హైదరాబాద్ లో మొదలు కానుంది. ఇందుకోసం ఓ స్టూడియోలో ప్రత్యేకమైన సెట్‌ని రూపొందించారు. 1985 రోజుల్లో, ఓ పల్లెటూరు ఎలా ఉంటుందో అచ్చంగా అలాంటి వాతావరణాన్ని సృష్టించారు. కళా దర్శకుడు రామకృష్ణ రూపొందించిన ఈ సెట్‌ కోసం 5 కోట్లు కేటాయించారు.  మైత్రీ మూవీస్‌ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus