టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. గేమ్ ఛేంజర్ మూవీని వీలైనంత వేగంగా పూర్తి చేసి బుచ్చిబాబు సినిమాతో బిజీ కావాలని రామ్ చరణ్ ప్లాన్ అని తెలుస్తోంది. అయితే అయోధ్య కార్యక్రమంలో రామ్ చరణ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. 500 సంవత్సరాల క్రితం చరిత్రలో ఏం జరిగిందో అది ఇప్పుడు మనముందు సాక్ష్యంగా నిలబడిందని చరణ్ పేర్కొన్నారు.
500 సంవత్సరాల రాముడి వనవాసం ముగిసి రాముడు అయోధ్యకు వచ్చాడని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. శ్రీరాముని ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని చరణ్ కామెంట్లు చేశారు. రాముని ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరు కావడం సంతోషంగా ఉందని చరణ్ అన్నారు. మన దేశంలో టీవీ ఛానెళ్ల ద్వారా శ్రీరాముని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్లు ఈ అద్వితీయమైన ఘటాన్ని ఆస్వాదించాలని రామ్ చరణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
చరిత్రలో ఇది అరుదైన ఘట్టమని ఈ వేడుకను ఆస్వాదించాలని ఆయన అన్నారు. శ్రీరాముడి దీవెనలను పొందాలని జై శ్రీరాం అంటూ రామ్ చరణ్ అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. రామ్ చరణ్ త్వరలో మరిన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. రామ్ చరణ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.
వైవిధ్యం ఉన్న కథలకు ప్రాధాన్యత ఇస్తున్న (Ram Charan) రామ్ చరణ్ కు రాబోయే రోజుల్లో కెరీర్ బెస్ట్ హిట్లు దక్కాలని ఫ్యాన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. రామ్ చరణ్ కు ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. రామ్ చరణ్ కు 2024 సంవత్సరం కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో కలిసిరావాలని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!