చెర్రీ…డేర్ చేస్తున్నాడా??

టాలీవుడ్ లో ఒక్కో హీరోకి ఒక్కో మ్యానరిజం ఉంటుంది….అందులో ముఖ్యంగా మన పెద్ద హీరోల ఫ్యామిలీలా విషయానికి వస్తే….నందమూరి వంసానికి నటన…డైలాగ్స్ లో ఉన్న పట్టు మరెవ్వరికీ ఉండదు…ఇక అదే క్రమంలో అందానికి, అభినయానికి కృష్ణ గారి వంశం పెట్టింది పేరు…ఇక మన మెగా ఫ్యామిలీ మ్యానరిజం వారి అభిమానులకు తెలిసిందే. అయితే ఇదిలా ఉంటే ఈ మధ్య అంతా కమర్షియల్ హవా నడుస్తున్న క్రమంలో కొత్త కధల జోలికి వెళ్ళాలి అంటే మన యువ హీరోలు చాలా ఆలోచిస్తున్నారు. అయితే ఏమనుకున్నాడో ఏమో చెర్రీ మాత్రం చాలా డేరింగ్ అండ్ డాషింగ్ స్టెప్ వేసేందుకు రెడీ అవుతున్నట్లు టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న వాదన.

ఇంతకీ విషయం ఏమిటంటే…ఆ మధ్య ఒక యువ దర్శకుడు చెర్రీకి కధ చెప్పే క్రమంలో ఈ కధలో కాస్త కౌబాయ్ టచ్ ఉంటుంది అని చెప్పినట్లు అప్పట్లో టాక్ వచ్చింది. అయితే అదే క్రమంలో కాస్త కాదు…కధ మొత్తం కౌ బోయ్ గెటప్ ఉండేలా మార్చి తీసుకురమ్మన్నాడట చెర్రీ….అయితే ఇప్పటివరకూ ఈ కౌ బాయ్ గెటప్ సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరు, ఇక ఆతరువాత ఒక పాటలో పవన్, ఒక సినిమాలో ప్రిన్స్ మాత్రమే వేశారు….సూపర్ స్టార్ కృష్ణ పునాది వేసిన ఈ తరహా పాత్రలో ఆయన తప్ప మిగిలిన హీరోలు ఎవ్వరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. అయితే ఆ మధ్య టక్కరి దొంగ గా వచ్చిన ప్రిన్స్ కూడా డిజాస్టర్ ను చవి చూసాడు అనే చెప్పాలి..మరి అలాటి రిస్క్, ఉన్న కధ, పాత్రను చెర్రీ ఎలా ఇష్ట పడ్డాడో ఆయనకే తెలియాలి. బహుశా చెర్రీకి హార్స్ రైడింగ్ అంటే ఇష్టం కాబట్టి అలాంటి కధ చెయ్యాలి అని ఆలోచన చేస్తున్నాడేమొ చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus