Ram Charan: ఇంత సాధించినా.. ఇంకా టాలీవుడ్‌ ప్రపంచానికి తెలియదా? ఏమైందంటే?

మన సినిమాల్లో ఓ డైలాగ్‌ ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. సినిమాల్లోని విలన్లు ఆ మాట అంటుంటారు. ‘మనం ఎంత పెద్ద రౌడీ/ విలన్‌ అనేది మనకు తెలిస్తే సరిపోదు.. ప్రపంచం మొత్తం తెలియాలి’ అని. అదేదో ఆ విలన్‌ అనే అహంకారంతోనే, యాటిట్యూడ్‌తోనే ఆ మాట వాళ్లు అని ఉండొచ్చు కానీ. బయట కూడా ఇలాంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. మనం ఇక్కడ ఎంత సాధించినా.. మన గుర్తింపును మన ఐడెంటిటీతో కాకుండా వేరే గుర్తింపుతో పిలిస్తే ఎంత బాధతో ఉంటుందో చెప్పండి.

Ram Charan

ఇప్పుడు టాలీవుడ్‌ మెగా పవర్‌ స్టార్‌ నుండి గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిన చరణ్‌ను (Ram Charan) .. బాలీవుడ్‌ మెగాస్టర్‌ అంటే ఎంత బాధగా ఉంటుందో చెప్పండి. ఆయనకేమే కానీ, ఆయన అభిమానులకు మాత్రం చాలా బాధేస్తుంది. ఇప్పుడు అదే జరిగింది కూడా. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రామ్ చరణ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆవిష్కరణలో పాల్గొన్నాడు. దానికి సంబంధించిన ఫొటోను ఆసీస్‌ క్రికెట్ బోర్డు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

మామూలుగా అయితే ఇది చరణ్‌ ఫ్యాన్స్‌ ఆనందించాల్సిన విషయం. కానీ ఆ ఫొటోతోపాటు వాళ్లు రాసిన కంటెంటే ఇబ్బందికరంగా మారింది. చరణ్‌ గురించి రాస్తూ బాలీవుడ్‌ మెగాస్టార్‌ అని రాసుకొచ్చింది క్రికెట్‌ ఆస్ట్రేలియా. మెగాస్టార్‌, టాలీవుడ్‌ స్టార్‌, గ్లోబల్‌ స్టార్‌ అని రాసి ఉంటే ఓకే. ఎలాంటి సంబంధం లేదని బాలీవుడ్‌ మెగాస్టార్‌ అని రాయడం ఇక్కడి జనాలకు, చరణ్ ఫ్యాన్స్‌కు నచ్చలేదు. సరైన విజయం లేక అల్లాడుతున్న బాలీవుడ్‌ను చరణ్‌ ముందు పెట్టడమా అనేది ఫ్యాన్స్‌ బాధ.

దీనిపై నెటిజన్లతోపాటు టాలీవుడ్ జనాలు కూడా విమర్శిస్తున్నారు. క్రికెట్‌ ఆస్ట్రేలియా ఈ విషయంలో జాగ్రత్తగా రాసి ఉంటే బాగుండేది అని అంటున్నారు. మరికొందరైతే టాలీవుడ్‌ ప్రపంచ స్థాయికి ఎదిగింది కానీ.. ఇంకా ఆస్ట్రేలియా జనాలకు తెలియడం లేదా అని కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయం ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.

టాలీవుడ్ సెలబ్రిటీస్ రాఖీ సెలబ్రేషన్స్ పిక్స్ వైరల్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus