Shankar, Ram Charan: శంకర్ చరణ్ తో రిస్క్ చేస్తున్నారా?

  • September 29, 2021 / 10:54 AM IST

స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కే ప్రతి సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చరణ్ తరువాత సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారనే సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 200 కోట్ల రూపాయల నుంచి 250 కోట్ల రూపాయలు అని సమాచారం. దిల్ రాజు నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ల కోసమే 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే శంకర్ గత సినిమాల ఫలితాలను చూసిన చరణ్ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. శంకర్ పొలిటికల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో చరణ్ పాత్ర గురించి వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఈ సినిమాలో చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ గా, సీఎంగా కనిపిస్తారని తెలుస్తోంది. చరణ్ శంకర్ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా త్వరగా రిలీజైతే మాత్రమే చరణ్ కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు దక్కనుంది.

ఈ మధ్య కాలంలో దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధిస్తున్నా భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ కావడం లేదు. చరణ్ శంకర్ కాంబో మూవీతో ఇండస్ట్రీ హిట్ సాధించాలని దిల్ రాజు భావిస్తున్నట్టు తెలుస్తోంది. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ రోల్ లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాతోనైనా శంకర్ సక్సెస్ ట్రాక్ లోకి వస్తారో లేదో చూడాల్సి ఉంది.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus