Ram Charan: ‘ఆర్.ఆర్.ఆర్’ యూనిట్ కు చరణ్ స్పెషల్ సర్ప్రైజ్..!

  • April 4, 2022 / 05:18 PM IST

రాంచరణ్ ఓ హీరోగా రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళను నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మరో హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించగా.. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. నార్త్ లో ఈ మూవీ స్లోగా స్టార్ట్ అయినప్పటికీ 10వ రోజున కలెక్షన్లు మొదటి రోజుకి మించి ఉండడాన్ని బట్టి ఈ మూవీ రోజు రోజుకీ ఎంత విశేషదారణ దక్కించుకుంటుంది అనే విషయం స్పష్టమవుతుంది.

Click Here To Watch NOW

10 రోజుల్లో ఈ మూవీ రూ.900 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్ళని రాబట్టి, రూ.1000 కోట్ల దిశగా దూసుకుపోతుంది.ఇప్పటికే ఈ మూవీ తెలుగు వెర్షన్ కు గాను ప్రపంచ వ్యాప్తంగా కలెక్ట్ చేసిన వసూళ్ళతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం ఇంత సక్సెస్ అవ్వడం పట్ల హీరోలు చరణ్, ఎన్టీఆర్.. అలాగే దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య వంటి వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఇంత విజయవంతం కావడంతో మెగా పవర్ స్టార్ రాంచరణ్ ‘ఆర్.ఆర్.ఆర్’ టీం ను బంగారు నాణేలు ఇచ్చి సత్కరించారు.

సినిమా కోసం పని చేసిన వివిధ శాఖలకు చెందిన హెచ్ఓడీలను తన ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కు ఆహ్వానించిన చరణ్ అటు తర్వాత వారితో కొంత సమయం గడిపి.. తర్వాత ఒక్కొక్కరికీ తులం బంగారం(10) ఇచ్చి సత్కరించారు. దాంతో పాటు ఓ స్వీట్ బాక్స్ కూడా వారికి అందజేయడం జరిగింది. ఈ విధంగా చరణ్ తన బంగారు మనసుని మరోసారి చాటుకున్నట్టు స్పష్టమవుతుంది. యూనిట్ సభ్యులను సత్కరించడం అనేది రాజమౌళికి అలవాటే.

ఈ మధ్యన సుకుమార్ కూడా మొదలుపెట్టాడు. సుకుమార్ ద్వారా అల్లు అర్జున్ కూడా అలవాటు చేసుకున్నాడు. ఇప్పుడు రాజమౌళి ద్వారా చరణ్ కూడా అలాంటి గొప్ప పని అలవాటు చేసుకున్నాడు కాబోలు..!ఇక ఈ మూవీ తర్వాత చరణ్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus