చరణ్ ఇంట దీపావళి సెలబ్రేషన్స్.. సందడి చేసిన మహేష్..తారక్.. స్టార్స్?

దీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఈ పండుగ వేడుకలలో పాల్గొని సందడి చేస్తున్నారు. ఇకపోతే టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ లో భాగంగా పలువురు సెలబ్రిటీలను ఆహ్వానించి ఘనంగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలను నమ్రత సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.

రామ్ చరణ్ దీపావళి పండుగను పురస్కరించుకొని టాలీవుడ్ స్టార్స్ ని ఆహ్వానించారని తెలుస్తుంది. ఇక ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా పాల్గొనడం విశేషం. నమ్రత షేర్ చేసిన ఫోటోలు కనుక చూస్తే మహేష్ బాబు ఎన్టీఆర్ విక్టరీ వెంకటేష్ వంటి సెలబ్రిటీలందరూ కూడా ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. మహేష్ బాబుతో పాటు నమ్రత, ఎన్టీఆర్ తో పాటు లక్ష్మీ ప్రణతి కూడా హాజరయ్యారని తెలుస్తుంది.

ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాలేకపోయిన ఆయన భార్య స్నేహ రెడ్డి ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొని సందడి చేశారు. ఇలా వీరంతా కలిసి దిగిన ఫోటోలను నమ్రత సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడమే కాకుండా తమకు ఈ ఆతిథ్యం ఇచ్చినందుకు ఉపాసన రాంచరణ్ లకు నమ్రత ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక అల్లు అర్జున్ గత రాత్రి మంగళవారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా హాజరైన సంగతి మనకు తెలిసిందే .ఇలా ఈవెంట్ కి ఆయన వెళ్లడంతో ఈ పార్టీకి దూరంగా ఉన్నారు.

ఈ విధంగా మహేష్ బాబు ఎన్టీఆర్ వారి సతీమణులతో కలిసి రాంచరణ్ ఇంట్లో సందడి చేయడంతో ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే గత కొద్దిరోజులుగా ఎన్టీఆర్ రామ్ చరణ్ మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ ఒక్క ఫోటోతో ఈ వార్తలన్నింటికీ పూర్తిగా ఫుల్ స్టాప్ పడిందని చెప్పాలి. ఇలా స్టార్స్ అందరూ కలిసి ఒకే చోట కనిపించడంతో ఈ ఫోటోలను చూసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus