‘ఆర్.ఆర్.ఆర్’ నుండీ రాంచరణ్ కొత్త లుక్ అదిరిపోయింది..!

రేపు మెగా పవర్ స్టార్ రాంచరణ్ పుట్టినరోజు కావడంతో ‘ఆర్.ఆర్.ఆర్’ నుండీ చరణ్ కు సంబంధించి మరో లుక్ ను విడుదల చేసాడు దర్శకధీరుడు రాజమౌళి. ఈ లుక్ ను చూసిన అభిమానులకు గూజ్ బంప్స్ రావడం గ్యారెంటీ అనే చెప్పాలి. ఈ స్పెషల్ పోస్టర్ లో రాంచరణ్ అలియాస్ అల్లూరి సీతారామ రాజు.. విల్లంబును ఎక్కు పెట్టి చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. రాజమౌళి ఈ పోస్టర్ ను ట్వీట్ చేస్తూ, ‘ధైర్యం, గౌరవం, సమగ్రత… కలిగిన నా సీతారామరాజును మీకు పరిచయం చేస్తున్నాను’ అంటూ పేర్కొన్నాడు.

ఇక ఇదే పోస్టర్ ను మరో హీరో ఎన్టీఆర్ పోస్ట్ చేస్తూ.. ‘గొప్ప లక్షణాలు ఉన్న సోదరుడు ఇతను’ అంటూ కామెంట్ చేసాడు. ఇక ఈ లుక్ పై రాంచరణ్ స్పందిస్తూ.. ‘అల్లూరి సీతారామరాజు పాత్రను పోషించడం నా అదృష్టం’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. మరి సోషల్ మీడియాలో ఈ పోస్టర్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. ఇక ఎన్టీఆర్ ఈ చిత్రంలో కొమరం భీమ్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. రామరాజుకి జోడీగా సీత పాత్రలో అలియా భట్ కనిపించనుంది.

పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘భీమ్ ఫర్ రామరాజు’ అలాగే ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్లకు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 13న ఈ చిత్రం విడుదల కాబోతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus