Ram Charan, Chiranjeevi: చిరంజీవికి చరణ్ స్పెషల్ విషెస్.. వీడియో వైరల్

మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం మరొక స్టార్ నటుడు ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. రాజమౌళి తీస్తున్న ఈ సినిమా ఇటీవల మొత్తం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక మరొకవైపు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి తో కలిసి తొలిసారిగా నటిస్తున్న ఆచార్య మూవీ షూటింగ్ లో తన పార్ట్ ని ఇటీవల పూర్తి చేసారు చరణ్. ఈ సినిమాలో చిరంజీవి ఆచార్య అనే మాజీ నక్సలైట్ పాత్రలో నటిస్తుండగా,

రామ్ చరణ్ సిద్ద అనే ఆయన అనుచరుడి పాత్రలో నటిస్తున్నట్లు టాక్. అయితే అసలు విషయం ఏమిటంటే నేడు మెగాస్టార్ చిరంజీవి 66వ జన్మదినం సందర్భంగా తండ్రి మెగాస్టార్ తో కలిసి ఇటీవల ఆచార్య మూవీ షూట్ కోసం నల్లమల అడవుల్లో జరిగిన షూటింగ్ తాలూకు కొన్ని మెమోరబుల్ సీన్స్ ని ఫ్యాన్స్ తో వీడియో ద్వారా షేర్ చేసుకున్నారు చరణ్. ఆయన నటన నాకు ఆదర్శం, ఆయనే నాకు స్ఫూర్తి ప్రదాత,

అటువంటి వ్యక్తితో నేను తొలిసారిగా కలిసి నటించిన ఆ రోజులు నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను, హ్యాపీ బర్త్ డే అప్పా అంటూ మెగాస్టార్ కి హార్ట్ ఫుల్ గా విషెస్ తెలుపుతూ చరణ్ పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. కొరటాల శివ తీస్తున్న ఈ సినిమాలో కాజల్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్నారు


చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus