మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఓ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్లో భాగంగా.. రామ్ చరణ్ కాస్త టంగ్ స్లిప్ అయ్యాడు అనే చెప్పాలి. ఒకసారి భోపాల్ బదులు బీహార్ అన్నాడు.
స్పీచ్ అయిపోయిన తర్వాత హోస్ట్ కొంతమంది భారత క్రికెటర్ల పేర్లు చెప్పి … చరణ్ ని వన్ వర్డ్ డిస్క్రిప్షన్ అడిగాడు. ఇందులో భాగంగా సచిన్ టెండూల్కర్, ధోని, విరాట్ కోహ్లీ వంటి వాళ్ళ గురించి చరణ్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చాడు.
అయితే చివర్లో హోస్ట్ భారత ఫాస్ట్ బౌలర్ ‘జస్‌ప్రీత్ బూమ్రా’ గురించి అడగ్గా చరణ్ షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు.చరణ్ మాట్లాడుతూ… “నేను జస్ ప్రీత్ బూమ్రాకి పెద్ద అభిమానిని. అతను ఫుట్‌బాల్ చాలా బాగా ఆడుతూ ఇండియాని ముందుకి తీసుకెళ్తున్నాడు” అంటూ వ్యాఖ్యానించాడు. సరిగ్గా ఈ ఆన్సర్ ని ఆధారం చేసుకునే చరణ్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది.
నంబర్ వన్ బౌలర్ అయినటువంటి బూమ్రాను అందులోనూ అతను ఇండియన్ బౌలర్, అలాంటి బౌలర్ గురించి గ్లోబల్ స్టార్ అయినటువంటి చరణ్ గారికి కొంచెం కూడా తెలీదా? పైగా అతని ఫుట్‌బాల్ ఆటగాడిని చేసేస్తాడా? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.రామ్ చరణ్ అలా పలికినప్పుడు కనీసం హోస్ట్ కూడా.. సరిచేసుకోమని హింట్ ఇవ్వకపోవడం బాధాకరం. చరణ్ బూమ్రాపై వీడియోని షేర్ చేస్తూ చాలా మంది ట్రోలింగ్ కి దిగారు.
వాస్తవానికి చరణ్ కి పేర్లు మర్చిపోయే అలవాటు ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ ఈ విషయాన్ని ఆల్మోస్ట్ ప్రతి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ విషయానికి వస్తే.. చరణ్ తండ్రి చిరంజీవి సైతం చాలా మంది స్టార్స్ పేర్లను తప్పుగా ప్రస్తావించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
నాకు ఫుట్-బాల్ ప్లేయర్స్ తెలీక వేరే బూమ్రా ఉన్నాడేమో అనుకున్నాను
కనీసం ఆ హోస్ట్ అయినా చరణ్ ని కరెక్ట్ చేయాలి కదా#peddi #peddi #RamCharan #Charan pic.twitter.com/KBODMrSmHw
— Phani Kumar (@phanikumar2809) May 23, 2026