ఈనెల 22నుంచి రాం చరణ్, సురేందర్ రెడ్డి, అల్లు అరవింద్ మూవీ షెడ్యూల్

ఈనెల 22నుంచి హైదరాబాద్ లో మెగా పవర్ స్టార్ రాం చరణ్, సురేందర్ రెడ్డి, అల్లు అరవింద్ మూవీ షెడ్యూల్. వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాతగా, ప్రతిష్టాత్మక చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన గీతా ఆర్ట్స్ బ్యానర్లో, స్టైలిష్ డైరెక్టర్ గా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ అందించిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

ఈ చిత్రంలో రాంచరణ్ న్యూ లుక్ లో కనిపించబోతున్నారు. క్యారెక్టర్ పరంగా చరణ్ స్టన్నింగ్ లుక్ తో అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరించనున్నాడు. చెర్రీ దీని కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. విభిన్నమైన కథాంశంతో రాం చరణ్, సురేందర్ రెడ్డి, అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్ర నిర్మాణం జరుగుతోంది. ఈ నెల 22నుంచి హైదరాబాద్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, యాక్షన్ పార్ట్ చిత్రీకరించనున్నారు. వచ్చే నెల 20 నుంచి కాశ్మీర్ లో కీలకమైన షెడ్యూల్ ని ప్లాన్ చేశారు. తమిళంలో వంద కోట్ల మైలురాయిని దాటిన తని ఒరువన్ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. రకుల్ ప్రీత్ అందచందాలు, అరవింద్ స్వామి పెర్ ఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ…. రాంచరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో నిర్మిస్తున్న చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాంచరణ్ ఈ క్యారెక్టర్ కోసం బాగా కష్టపడుతున్నాడు. తనను తాను డిఫరెంట్ లుక్ లో ప్రెజెంట్ చేసుకోబోతున్నాడు. సురేందర్ రెడ్డి స్టైలిష్ మేకింగ్ ని మరోసారి చూడబోతున్నాం. అరవింద్ స్వామి క్యారెక్టరైజేషన్ ఈ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. ఈనెల 22నుంచి హైదరాబాద్ లో షూటింగ్ చేయబోతున్నాం. ఈ షెడ్యూల్ లో ఇంపార్టెంట్ సీన్స్ తో పాటు… యాక్షన్ పార్ట్ ని గ్రాండియర్ గా షూట్ చేయబోతున్నాం. వచ్చే నెల 20 నుంచి కాశ్మీర్ ని అందమైన లొకేషన్స్ లో కీలక సన్నివేశాలు ప్లాన్ చేశాం. అని అన్నారు.

నటీనటులు

రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు
సాంకేతిక నిపుణులు
సినిమాటోగ్రాఫర్ – అసీమ్ మిశ్రా
మ్యూజిక్ – హిప్ హాప్ ఆది
ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్
ఆర్ట్ – నాగేంద్ర
ఎడిటర్ – నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – వి.వై. ప్రవీణ్ కుమార్
కో ప్రొడ్యూసర్ – ఎన్.వి.ప్రసాద్
ప్రొడ్యూసర్ – అల్లు అరవింద్
దర్శకుడు – సురేందర్ రెడ్డి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus