Ram Charan: #RC15 నుండి చరణ్ లేటెస్ట్ లుక్ వైరల్..!

  • July 2, 2022 / 03:24 PM IST

దిల్ రాజు తన ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్‌పై చరణ్- శంకర్ కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన బ్యానర్లో తెరకెక్కుతున్న 50 వ చిత్రం కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యింది.కానీ అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ చిత్రం ‘ఒకే ఒక్కడు’ తరహాలో మంచి మెసేజ్ తో కూడి ఉంటుంది అని ప్రచారం జరుగుతున్న వేళ

చరణ్ ఇందులో మూడు వైవిధ్యమైన పాత్రలను పోషించనున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అంటే మన విజయ్ చేసిన ‘మెర్సల్’ లా అనమాట. అందుకు తగ్గట్టే చరణ్ ఇప్పటివరకు మూడు విభిన్నమైన లుక్స్ లో కనిపించి ఈ వార్తలకు మరింత బలం చేకూర్చి నట్టు అయ్యింది. ఇది నిజమో కాదో తెలియదు కానీ షూటింగ్ స్పాట్ నుండి బయటకు వస్తున్న రాంచరణ్ లుక్స్ చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఓ లుక్ లో అతను గడ్డం లేకుండా మీసాలతో కనిపిస్తున్నాడు.

మరో లుక్ లో సూటు బూటు వేసుకుని లైట్ గడ్డంతో కనిపిస్తున్నాడు. ఇక మరో లుక్ లో అయితే గడ్డంతో పాటు లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్నాడు. ఈ మూడో లుక్ లో రాంచరణ్ చాల మాస్ గా, రఫ్ గా, హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. తాజాగా షూటింగ్ స్పాట్ నుండి బయటకు వచ్చిన ఓ వీడియో బైట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.ఈ లుక్ లో చరణ్ ‘బిగ్ బాస్’ లో చిరులా కనిపిస్తున్నాడు.

ఆ సినిమా ఆడకపోయినా అందులో చిరంజీవి గడ్డం లుక్ ఫ్యాన్స్ కు విపరీతమైన కిక్ ఇచ్చింది ఆ రోజుల్లో..! ఇక ఈ ‘RC15’ లో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. అంజలి కీలక పాత్ర పోషిస్తుంది. శ్రీకాంత్ నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్ర పోషించనున్నాడు. మలయాళం నటుడు జయరాం కూడా ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus