రామ్ చరణ్ కొత్త సినిమా టైటిల్ ‘ధృవా’ లేక ‘రక్షక్’?

ఇప్పుడు మెగా అభిమానులకి అంతు చిక్కని విషయం చెర్రీ కొత్త సినిమా ని ఎప్పుడు ప్రారంభిస్తాడు, దాని టైటిల్ ఏంటి అని మెగా అభిమానులు అయోమయం లో ఉన్న తరుణం లో వాళ్లకు ఊరట కలిగించే విషయం ఒకటి తెలిసింది.’బ్రూస్ లీ’ సినిమా అభిమానులను కొంత నిరాశపరిచిందని ఈ సారి ఎలాగైనా మంచి హిట్ ఇచ్చి అభిమానుల ఆశలు  నిజం చెయ్యాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు చెర్రీ.అందులో భాగంగానే ‘తని ఒరువన్’సూపర్ హిట్ తమిళ్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి విదితమే.ఇప్పటికే డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెలుగులో స్క్రిప్ట్ రెడీ చేసారు.ఈ నెల 18 అధికారికంగా లాంచ్ చెయ్యడానికి డేట్ ఫిక్స్ చేసారు.
ఈ సినిమా లో చెర్రీ పవర్ ఫుల్ ఐ.పి.యస్, పాత్రలో కనిపించనున్నాడు. తమిళ్ లో విలన్ గా నటిచిన అరవింద్ స్వామే  తెలుగులోనూ విలన్ గా నటించనున్నాడు.మొదట ఎ సినిమాకి ‘రక్షక్’ అనే టైటిల్ అనుకున్నా,’ధృవా’ అనే తిట్టలే కూడా పరిశీలనలో ఉంది అని,ఎక్కువ శాతం దీనినే టైటిల్ గా పెట్టె అవకాసం ఉందని విశ్వసనీయ సమాచారం.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus