రంగస్థలం చూసి తమ తల్లిదండ్రులు ఏమన్నారో చెప్పిన రామ్ చరణ్.!

ఒక వ్యక్తి విజయం సాధిస్తే అతని తల్లిదండ్రులకంటే ఎక్కువ సంతోషించేవారు ఎవరూ ఉండరు. బిడ్డ ప్రయోజకుడు అయ్యాడని మురిసిపోతారు. రంగస్థలం సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి దంపతుల పరిస్థితి అదే. రామ్ చరణ్ నటనకు వారు ముగ్ధులైపోయారు. చిరు ఇలాంటి సినిమాలు ఎన్నో చేశారు. ఎన్నో రికార్డులు కొల్లగొట్టారు. భర్త విజయాన్ని సురేఖ కూడా దగ్గరుండి చూసారు. అయినా కొడుకు విజయాన్ని చూసి వారిద్దరూ ఎంతో సంతోషించారు. ఆ విషయాన్నీ నిన్న జరిగిన రంగస్థలం విజయోత్సవ వేడుకలో రామ్ చరణ్ వెల్లడించారు. “ఈ సినిమా చూసిన తర్వాత మా మమ్మీడాడీ ఇచ్చిన రియాక్షన్ మర్చిపోలేను. సినిమా చూడడం అయ్యాక మా అమ్మకు మాటలు రాలేదు. చాలా భారంగా కళ్లలో నీళ్లతో ఉన్న మా అమ్మ నా చేయి పట్టుకుని ఆమె పక్కన కూర్చోబెట్టుకుంది.

‘చాలా బాగుంది’ అని చెప్పింది. అలాగే కల్యాణ్ బాబాయ్ ఇంటికి పిలిచి రంగస్థలంలో చాలా బాగా చేశావని చెబుతున్నారని ప్రశంసించారు. “మీ ఇంట్లో ఈ సినిమా వేయిస్తాను బాబాయి” అని చెప్పాను. “ఇంట్లో వద్దు.. ఇంకెక్కడైనా చూడాలని ఉంది” అన్నారు. “ప్రివ్యూ థియేటర్ లో చూద్దాం” అని చెప్పాను. “ఎక్కడైనా జనాలతో కలిసి సినిమా చూడాలని ఉంది” అని బాబాయ్ అన్నారు. ఆయన అలా అడగడం నేను మర్చిపోలేకపోతున్నా.” అని రామ్ చరణ్ వెల్లడించారు. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా 150 కోట్ల మార్క్ ని దాటుకొని 200 కోట్ల క్లబ్ లో చేరడానికి పరుగులు తీస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus