PEDDI: పెద్ది.. మిగతా పాటలకు ఇదో పెద్ద తలనొప్పి!

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే మోత.. అదే ‘చికిరి చికిరి’. ఈ పాట రిలీజై పది రోజులు దాటినా, ఆ క్రేజ్ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. ఏఆర్ రెహమాన్ నుంచి ఇలాంటి మాస్ బీట్ వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో ఈ పాట సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు.

PEDDI

అయితే ఈ పాట సక్సెస్ ఇప్పుడు మిగతా సినిమాలకు ఒక బెంచ్‌మార్క్‌గా, ఇంకా చెప్పాలంటే ఒక సమస్యగా మారింది. దీని తర్వాత వచ్చిన ‘ఆంధ్రా కింగ్’, ‘అఖండ 2’ పాటలు వినడానికి బాగున్నా, ‘చికిరి’ రేంజ్ రీచ్‌ను అందుకోలేకపోతున్నాయి. జనం దృష్టి మొత్తం ఈ ఒక్క పాట మీదే ఉండటంతో, మిగతావి సోషల్ మీడియా అల్గారిథమ్‌లో వెనకబడిపోతున్నాయి. వ్యూస్, రీల్స్ పరంగా ఈ సాంగ్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. శంకర్ లాంటి లెజెండ్ ‘గేమ్ ఛేంజర్’లో చూపించలేకపోయిన రామ్ చరణ్ ఎనర్జీని, బుచ్చిబాబు పర్ఫెక్ట్‌గా కాప్చర్ చేశాడు. నార్త్ ఆడియన్స్ కూడా ఈ పాటను ఓన్ చేసుకోవడం చూస్తుంటే, సినిమాకు అక్కడ భారీ ఓపెనింగ్స్ గ్యారెంటీ అనిపిస్తోంది. మాస్ పల్స్ పట్టుకోవడంలో బుచ్చిబాబు సక్సెస్ అయ్యాడని ఈ ఒక్క పాటతో అర్థమైపోయింది.

ఇక ఈ ఊపులోనే రెండో పాటను వదలాలని టీమ్ అనుకుంటున్నా, పరిస్థితులు అనుకూలించడం లేదు. వచ్చే నెలలో రాబోయే సంక్రాంతి సినిమాలు, ముఖ్యంగా మెగాస్టార్ (శంకరవరప్రసాద్) కంటెంట్‌తో క్లాష్ అవ్వకూడదనే జాగ్రత్త కూడా ఇందులో ఉందట.

కాబట్టి డిసెంబర్ చివర్లో గానీ రెండో పాట వచ్చే ఛాన్స్ లేదు. అప్పటివరకు నెటిజన్లకు ఈ ‘చికిరి’ హ్యాంగోవర్ దిగేలా లేదు. మొత్తానికి బుచ్చిబాబు వదిలిన ఈ ఒక్క పాట.. టాలీవుడ్ మ్యూజిక్ లవర్స్‌ని ఒక ఊపు ఊపేస్తోంది. కానీ సెకండ్ సాంగ్ కూడా అంతకుమించి అనేలా ఉండాలి. అలగైతేనే సినిమా బజ్ నెక్స్ట్ లెవెల్ కు వెళుతుంది. మరి రెహమాన్ ఈసారి ఎలాంటి బీట్ ని ఇస్తాడో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags