Jr NTR, Ram Charan: ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ లో గిల్లుడు పంచాయితీ!

స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో చరణ్, తారక్ హీరోలుగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ దేశభక్తి మూవీ అని చాలామంది భావించినా దర్శకధీరుడు రాజమౌళి స్నేహం ప్రధానంగా ఈ సినిమా సాగుతుందని దేశభక్తి డైలాగ్స్ ఉండవని చెబుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఈ సినిమా ప్రెస్ మీట్ జరిగింది. రెండు రోజుల క్రితమే జరగాల్సిన ఈ ప్రెస్ మీట్ కొన్ని కారణాల వల్ల ఈరోజు జరిగింది.

స్టార్ హీరోలు చరణ్, ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ఓపికగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చారు. అయితే ప్రెస్ మీట్ లో చరణ్ తారక్ ఒకరిపై ఒకరు సరదాగా చేసుకున్న కంప్లయింట్స్ ప్రేక్షకులకు నవ్వు తెప్పించాయి. జక్కన్న మాట్లాడుతూ చరణ్, తారక్ ఒకరిపై ఒకరు తను కొట్టాడని, గిచ్చాడని ఫిర్యాదులు చేశారని చెప్పారు. ఎన్టీఆర్ వెంటనే చరణ్ తనపై దాడి చేస్తే ధర్మం చెప్పారా? తీర్పు చెప్పారా? అంటూ రాజమౌళిని ప్రశ్నించారు.

ఆ తర్వాత నేను దాడి చేశానా? అంటూ రామ్ చరణ్ ఎన్టీఆర్ ను నిలదీశారు. ఇద్దరు స్టార్ హీరోలు అయినప్పటికీ ఫ్రెండ్లీగా చరణ్, ఎన్టీఆర్ చేసిన అల్లరి ఆకట్టుకుంది. షూటింగ్ అంతా అల్లరిగా సాగిందని చరణ్, తారక్ తమ కామెంట్ల ద్వారా చెప్పకనే చెప్పేశారు. ప్రెస్ మీట్ అనంతరం ఎన్టీఆర్, చరణ్ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే ఆ సమయంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ గిచ్చాడనే ఎక్స్ ప్రెషన్ ఇస్తూ దూరం జరిగారు.

చరణ్ ఎందుకు దూరం జరిగావని అడగగా ఎన్టీఆర్ మళ్లీ నవ్వుతూ ఫోజులిచ్చారు. ఆర్ఆర్ఆర్ చరణ్, తారక్ కెరీర్ లో మెమరబుల్ హిట్ గా నిలుస్తుందని అభిమానులు అనుకుంటున్నారు. 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ బాహుబలి2 కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేస్తుందో లేదో చూడాల్సి ఉంది. ఏపీలో టికెట్ రేట్లు పెరిగితే మాత్రం ఆర్ఆర్ఆర్ మూవీ కొత్త రికార్డులు క్రియేట్ చేయడం కష్టం కాదనే కామెంట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ను గిచ్చి చరణ్ సరదాగా ఝలక్ ఇచ్చారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus