కీర్తి సురేష్ పై అభినందనలు కురిపించిన రామ్ చరణ్ తేజ్

అభినేత్రి సావిత్రి జీవితాన్ని నాగ్ అశ్విన్ మహానటి చిత్రం ద్వారా అద్భుతంగా ఆవిష్కరించారు. ఇందులో సావిత్రిగా కీర్తి సురేశ్ నటనకు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఫిదా అయిపోయారు. దర్శకధీరుడు రాజమౌళి కీర్తి నటనను కీర్తించారు. అంతేకాదు అల్లు అరవింద్ కుటుంబసభ్యులు మహానటి టీమ్ కి సన్మానిస్తే అక్కడకు రాజమౌళి వెళ్లి నటీనటులను, ఆర్టిస్టులను అభినందించారు. అలాగే చిరంజీవి కూడా దర్శక నిర్మాతలను తన ఇంటికి ఆహ్వానించి సత్కరించారు. అయితే రామ్ చరణ్ మాత్రం సినిమా షూటింగ్ లలో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాని ఆలస్యంగా చూసారు.

చూసిన వెంటనే తన అభిప్రాయాన్ని ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. “మహానటి సినిమా నా మనసును టచ్ చేసింది. నాగ్ అశ్విన్ ఎంతో అంకితభావంతో ఈ సినిమాను తెరకెక్కించాడు. సావిత్రిగా కీర్తి సురేశ్ అద్భుతంగా నటించింది. ఈ పాత్రను ఆమె తప్ప వేరెవరూ ఇంతబాగా చేయలేరనిపించింది. సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండల నటన కూడా ఎంతో సహజంగా ఉంది. ఇంతగొప్ప చిత్రాన్ని అందించిన నిర్మాతలకి శుభాకాంక్షలు” అని పోస్ట్ చేశారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 26 రోజుల్లో 26 కోట్ల షేర్ రాబట్టి దూసుకుపోతోంది. ఓవర్సీస్ లోను స్టార్ హీరోల సినిమాల మాదిరిగా కలక్షన్ల జోరు కొనసాగిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus