Ram Charan: అలాంటి హీరోయిన్లను నమ్ముకుంటున్న చరణ్.. సెంటిమెంట్ రిపీటవుతుందా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా ఫ్లాప్ హీరోయిన్లకు సైతం ఛాన్స్ ఇస్తుండటం గమనార్హం. రామ్ చరణ్ రకుల్ కాంబినేషన్ లో కొన్నేళ్ల క్రితం బ్రూస్ లీ టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కి ఫ్లాప్ గా నిలిచింది. అయితే బ్రూస్ లీ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నా ధృవ సినిమాలో చరణ్ రకుల్ కు ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించింది.

రామ్ చరణ్ కియారా అద్వానీ కాంబినేషన్ లో వినయ విధేయ రామ తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే రామ్ చరణ్ కియారా అద్వానీకి గేమ్ ఛేంజర్ లో ఛాన్స్ ఇచ్చారు. రామ్ చరణ్ నెగిటివ్ సెంటిమెంట్లను, ఫ్లాప్ సెంటిమెంట్లను పట్టించుకోరని అందుకే తన సినిమాలలో ఫ్లాప్ సినిమా హీరోయిన్లను రిపీట్ చేస్తున్నారని తెలుస్తోంది. రకుల్ విషయంలో జరిగినట్టే కియారా విషయంలో జరుగుతుందేమో చూడాల్సి ఉంది.

రామ్ చరణ్ సోషల్ మీడియాపై పెద్దగా దృష్టి పెట్టకపోయినా సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. రామ్ చరణ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటుండగా తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా నుంచి మరో సాంగ్ లీకైన సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

రామ్ చరణ్ (Ram Charan) బుచ్చిబాబు కాంబో మూవీ వచ్చే ఏడాది మొదలుకానుంది. ఈ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. చరణ్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు. 16 సంవత్సరాల సినీ కెరీర్ లో రామ్ చరణ్ కేవలం 14 సినిమాలలో నటించగా సినిమాల విషయంలో రామ్ చరణ్ వేగం పెంచాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus