RC15: శంకర్, రామ్ చరణ్ సినిమా షూటింగ్ అప్డేట్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇంటర్నేషనల్ రేంజ్ లో ఈ సినిమాకి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాతో చరణ్ క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారాయన. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కొంతవరకు జరిగింది. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ని మొదలుపెట్టనున్నారు.

హైదరాబాద్ పాతబస్తీలో ఈ సినిమా షూటింగ్ ను నిర్వహించనున్నారు . ఈ వారంలోనే కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. ముందుగా పాతబస్తీలో రామ్ చరణ్ మీద ఓ పాటని చిత్రీకరించనున్నారు. ఆ తరువాత రాజమండ్రి, విశాఖలో మిగిలిన షూటింగ్ చేయనున్నారు. ఇదివరకు కూడా ఏపీలోని రాజమండ్రి, వైజాగ్ లలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. పాటలను చిత్రీకరించడంలో దర్శకుడు శంకర్ కి సెపరేట్ స్టైల్ ఉంది. ఆయన సినిమాల్లోని పాటల్లో భారీతనం కనిపిస్తుంది.

రామ్ చరణ్ కోసం కూడా అలాంటి సాంగ్స్ ప్లాన్ చేశారట. ఆ మధ్య ఫారెన్ లో బాస్కో సీజర్ కొరియోగ్రఫీలో తీసిన సాంగ్ కూడా సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. జూన్ నెలాఖరుకు సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలనుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా కనిపించనున్నారు. ప్రెజంట్ లో అయితే ఐఏఎస్ అధికారిగా కనిపిస్తారు.

తండ్రీ కొడుకులుగా రెండు క్యారెక్టర్లు ఉంటాయని టాక్. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా కనిపించనుంది. అలానే నటి అంజలి మరో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ,వెన్నెల కిషోర్, ప్రియదర్శి ఇలా చాలా మంది తారలు ఈ సినిమాలో కనిపించనున్నారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus