దిల్ రాజు పక్కా ప్లానింగ్‌తో సినిమా స్టార్ట్ చేస్తున్నారు. శంకర్ సినిమా అయినా సరే… అనుకున్న సమయానికి రిలీజ్ అయ్యేలా చూస్తారు – ఈ మాటలు ఎక్కడో విన్నట్లుగా ఉంది కదా. కచ్చితంగా వినే ఉంటారు. శంకర్ – రామ్‌చరణ్ సినిమా స్టార్ట్ అయినప్పుడు దిల్ రాజు టీమ్ ఈ విషయాల్ని అన్యాపదేశంగా చాలా సార్లు చెప్పింది. అయితే ఇప్పుడు పరిస్థితి అలానే ఉందా? అంటే లేదనే చెప్పాలి. ఎంతలా మారిపోయింది అంటే.. సమ్మర్‌లో కూడా శంకర్ – చరణ్ సినిమా రావడం కష్టం అనేంతలా.
దిల్ రాజు నిర్మాణ సంస్థలో 50వ సినిమా చరణ్ – శంకర్ సినిమాను అనౌన్స్ చేశారు. బాబోయ్ శంకర్ సినిమా అంటే భారీ బడ్జెట్, అందులోనూ ఆలస్యం, ఆకస్మిక హాల్ట్‌లు ఇలాంటివి చాలా ఉంటాయి మరి దిల్ రాజు ఎలా హ్యాండిల్ చేస్తారో అనుకున్నారు. ఎందుకంటే దిల్ రాజు బ్యానర్‌లో సినిమాలు టైమ్ అంటే టైమ్ అనే కాన్సెప్ట్‌లో ఉంటాయి. అలాంటి ఈ కాంబో టైమ్‌కి వచ్చేస్తుందా అనే ప్రశ్న వినిపించింది. అప్పుడు అనుమానించినట్లుగానే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. తొలుత సంక్రాంతికి వస్తుంది అని చెప్పిన ఈ సినిమా ఆ తర్వాత సమ్మర్ రేసులో నిలిచింది అని చెప్పారు. అయితే ఇప్పుడు సమ్మర్ కూడా కష్టమే అంటున్నారు. సినిమాకు సంబంధించి షూటింగ్ చాలా బ్యాలెన్స్ ఉందని టాక్. దీని కోసం సుమారు 100 రోజులు అవసరమవుతుంది అని అంటున్నారు. శంకర్ ఇప్పుడు ‘ఇండియన్ 2’, చరణ్ సినిమాతో రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో దిల్ రాజు తన సినిమా పూర్తి చేసుకోవడానికి చాలా రోజులు ఆగాల్సి వస్తుంది అంటున్నారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎలానూ ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇవన్నీ పూర్తి చేస్తే వచ్చే ఏడాది ఆఖరులో సినిమా రావొచ్చు అంటున్నారు. లేదంటే 2024 సంక్రాంతి అయిపోతుంది అనే మాట కూడా వినిపిస్తోంది.
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!