RC15 : రామ్ చరణ్ సినిమాను అడ్డుకున్న బీజేపీ కార్పొరేటర్.. కారణం అదేనా?

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన నటుడు రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుత ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఇకపోతే ఇందులో రాంచరణ్ ద్విపాత్రాభినయంలో సందడి చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లో సరూర్‌నగర్ వి.ఎం.హోంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే సినిమా షూటింగ్ నిలిపివేయాలి అంటూ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అడ్డుకున్నారు.

ఈ సినిమా షూటింగ్ విక్టోరియా మెమోరియల్ స్కూల్‌లో జరుగుతుండగా షూటింగ్ నిలిపివేయాలంటూ డీఆర్వో కు కంప్లైంట్ ఇవ్వడంతో డీఆర్వో ఈ సినిమా షూటింగ్ నిలిపివేశారు. పాఠశాలలో తరగతులు జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కి ఎలా అనుమతి ఇచ్చారంటూ ఆమె ఈ సినిమా షూటింగ్ అడ్డుకున్నారు. ఇలా తరగతులు జరుగుతున్న సమయంలో షూటింగ్ చేయటం వల్ల విద్యార్థుల సైతం తమ చదువులపై దృష్టి పెట్టరని శ్రీవాణి పేర్కొన్నారు.

ఈ సినిమా షూటింగ్ కోసం అప్పటికప్పుడు పాఠశాల మరమ్మతుల కోసం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిధులను విడుదల చేయడంపై కూడా ఈమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో షూటింగ్ జరగకూడదంటూ ఈమె కంప్లైంట్ ఇవ్వడంతో డిఆర్ఓ ఆదేశాల మేరకు సినిమా షూటింగ్ ఆపివేశారు. ఇకపోతే ఇందులో రామ్ చరణ్ పల్లెటూరి నుంచి వచ్చిన ఒక రాజకీయ నాయకుడి పాత్రలోనూ అలాగే ఒక ప్రభుత్వాధికారిగా కూడా కనిపించనున్నట్లు సమాచారం

అందుకే ఈ సినిమాకి అధికారి అనే టైటిల్ పెట్టాలని ఆలోచనలో ఉన్నారు. మరి ఈ విషయం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇక ఈ సినిమాని భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus